దీపిక ప్యాడ్ మాన్ చాలెంజ్ ఎవరికో తెలుసా ?
- February 04, 2018
ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్ అంటూ ట్రెండ్‌కు తగ్గట్టు చాలా చాలెంజ్‌లు చూశాం. అదే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్. శానిటరీ ప్యాడ్‌ను చేతిలో పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అవును.. నా చేతిలో ఉన్నది శానిటరీ ప్యాడే. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అంతే కాదు మీరు(ట్యాగ్ చేసిన వ్యక్తులు) కూడా ఇలా శానిటరీ ప్యాడ్ పట్టుకొని ఫొటో పోస్ట్ చేయమని చాలెంజ్ చేస్తున్నా అంటూ.. సామాన్యుల దగ్గరి నుంచి మొదలు పెడితే బాలీవుడ్ స్టార్ల వరకు అందరు ఈ ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్‌లో పాల్గొనడమేకాకుండా తమకు తెలిసినవారిని ఈ చాలెంజ్ స్వీకరించాలంటూ సవాలు విసురుతున్నారు. దీనిలో భాగంగానే నటుడు అక్షయ్ కుమార్ విసిరిన ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్‌ను దీపికా పదుకోన్ స్వీకరించారు. అంతేకాకుండా ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్ స్వీకరించాలని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు సవాలు విసిరారు.
అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ ముఖ్య తారలుగా ఆర్.బాల్కీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమిర్‌ఖాన్ ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ చాలెంజ్’ స్టార్ట్ చేశారు. అరుణాచలమ్ మురుగనాథమ్ అనే వ్యక్తి తక్కువ ధరకు లభ్యమయ్యే శానిటరీ నేప్కిన్లను తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసేవారు. ఆ విధంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన అరుణాచలమ్ కథతో ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ తీశారు. ఇతరుల్లో అవగాహన కలిగించే ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువ అవ్వాలని ఆమిర్ ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ చాలెంజ్‌కు నాంది పలికారు. అమిర్ స్టార్ట్ చేసిన ఈ చాలెంజ్‌ను ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులే కాకుండా చాలా మంది స్వీకరించి, తమకు తెలిసిన వాళ్లని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ చాలెంజ్ విసురుతున్నారు. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా సోషల్ అవేర్నెస్ కోసం స్టార్ట్ చేసిన చాలెంజ్. ఈ చాలెంజ్ ముఖ్య ఉద్దేశం ప్యాడ్స్ గురించి మాట్లాడటానికి మనం సిగ్గుపడకూడదని. ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







