పెట్రోలు బంకులో పెట్రోలు అమ్మిన భాగమతి అనుష్క

- February 04, 2018 , by Maagulf
పెట్రోలు బంకులో పెట్రోలు అమ్మిన భాగమతి అనుష్క

" భాగమతి " సినిమాతో హిట్ కొట్టిన అనుష్క..పెట్రోలు బంకులో పెట్రోలు కొడుతూ ప్రత్యక్ష మైంది. మరేం లేదు.. ఓ సోషల్ కాజ్ కోసం ఆమె ఇందుకు పూనుకొంది. నటి మంచు లక్ష్మి హోస్ట్ గా ఓ టీవీ చానల్ లో ప్రసారం కానున్న " మేము సైతం " అనే కార్యక్రమం కోసం ఈ అమ్మడు పెట్రోలు బంకులో వినియోగదారులకు పెట్రోలు అమ్ముతూ సామాజిక సేవ చేసింది. " మేము సైతం " కార్యక్రమానికి గెస్టుగా వచ్చే సెలబ్రిటీలు ఏదో ఒక పని చేసి అలా వచ్చే సొమ్ముతో పేదలను, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఈ ప్రోగ్రాం ముఖ్య లక్ష్యం. ఈ కార్యక్రమ ఫస్ట్ సీజన్ ముగిసిపోగా..రెండో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి జరిగిన షూటింగ్ లో అనుష్క పాల్గొంది. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ రోడ్ నెం. 1 లో గల పెట్రోలు బంకులో అనుష్క పెట్రోలు అమ్మిన సీన్స్ చిత్రీకరించారు. ఆమెను చూసేందుకు వాహనదారులు, అభిమానులు పోటీలు పడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com