దుబాయ్‌లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన కొత్త హోటల్
- February 12, 2018
దుబాయ్: గల్ఫ్ మెట్రోపొలిస్ దుబాయ్ రికార్డులు సృష్టించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన కొత్త హోటల్‌ను తాము ప్రారంభిస్తున్నట్లు ఆదివారంనాడు ప్రకటించింది.
ఈ గోవెరా హోటల్ 75 అంతస్థులతో నిర్మితమైంది. దాని ఎత్తు 356 మీటర్లు లేదా దాదాపు పావు మైలు ఉంటుంది. అంతకు ముందు ఈ రికార్డు దుబాయ్ జెడబ్ల్యు మారియోట్ మార్క్వీస్పై నమోదై ఉంది.
గోవేరా హోటల్ ఎత్తుకన్నా ఇది ఒక్క మీటరు ఎత్తు మాత్రమే తక్కువగా ఉంటుంది. గోవెరా హోటల్ సోమవారంనాడు అతిథుల కోసం తెరుచుకుంటుందని ఎమిరేట్స్ దినపత్రిక ది నేషనల్ రాసింది.
ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫా కూడా దుబాయ్‌లోనే ఉంది. ఇది 828 మీటర్ల ఎత్తు ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ట్రేడ్ ఫెయిర్ ఎక్స్పో 2020ని నిర్వహిస్తోంది. అప్పటికి ఏడాదికి 20 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించాలనేది లక్ష్యంగా ఉంది.
ఎడారి ప్రాంతమైన దుబాయ్ అద్భుతమైన షాపింగ్ మాల్స్కకు, పలు లగ్జరీ రిసార్టులకు, ఇండోర్ స్కై రిసార్ట్‌కు ప్రసిద్ధి గాంచింది.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







