స్టెప్పులు వేయరు మన రజని..
- May 04, 2015
ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ వివాహ వేడుకల్లో భాగంగా నిర్వహించే 'సంగీత్' కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టెప్పులు వేస్తారంటూ మీడియాలో వార్తలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. అయితే మంచు వారి వివాహ వేడుకల్లో రజనీ మాత్రం స్టెప్పులు వేయరంటా. ఇదే విషయాన్ని హీరో మోహన్ బాబు కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు వెల్లడించారు. ఇవన్నీ వట్టి పుకార్లు అంటూ కొట్టి పారేశారు. రజనీ, మోహన్ బాబు మంచి స్నేహితులు ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ వివాహ వేడుకలకు రజనీ హజరవుతారు. కానీ ఆయన స్టెప్పులు మాత్రం వేయరన్నారు. ఇదే విషయంపై రజనీకి అత్యంత సన్నిహితులు కూడా స్పందించారు. రజనీ తన ఇద్దరు కుమార్తెల వివాహం జరిగిన సమయంలోనే ఆయన స్టెప్పులు వెయ్యలేదన్న సంగతి వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వివాహం మే 20వ తేదీన హైదరాబాద్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో మంచు వారి వివాహనికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ వివాహ వేడుకలు మే 14 వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. శంషాబాద్ లోని మోహన్ బాబు నివాసంలో ఈ 'సంగీత్' వేడుకకు వేదిక కానుంది. వరుసగా ఐదు రోజులపాటు ధూమ్ ధామ్ గా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటిలో ప్రతిరోజు 'సంగీత్' ఉంటుంది...
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







