ఆరోగ్యానికి పీచు..
- May 04, 2015
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? కేవలం ఆహారంలో ఒక చిన్న మార్పు మీ పూర్తి ఆరోగ్యాన్నే మార్చేస్తుంది. మీరు ప్రతిరోజూ మీ ఆహారంలో 30 గ్రాముల పీచు ఉండేలా చూసుకుంటే చాలు. మీ బరువు పెరగరు సరికదా... పెరిగిన బరువూ తగ్గే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏ)సంస్థ టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉన్న దాదాపు 240 మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. ఇందులో ఆల్కహాల్, ఉప్పు, చక్కెరలను చాలా పరిమితంగా తీసుకుంటూ పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలతో వండిన వంటలతో పాటు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మధ్య సమతౌల్యం పాటిస్తే ఏడాదిలోనే 2.72 కిలోలు (ఆరు పౌండ్ల) బరువు తగ్గుతారు. అందుకే నీచు బదులు పీచు తినడమే మేలంటున్నారు ఏహెచ్‌ఏ సంస్థ వారు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







