'మామ మంచు అల్లుడు కంచు' సినిమా ఆడియో వేడుక
- November 28, 2015
మోహన్ బాబు అల్లరి నరేష్ కలిసి నటిస్తున్న 'మామ మంచు అల్లుడు కంచు' సినిమా ఆడియో వేడుక నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమం అంతా చాల హాస్యపూరిత వాతావరణంలో జరగడంతో ఈకార్యక్రమానికి వచ్చిన అతిధులు ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు. ఈకార్యక్రమoలో పాల్గొన్న ఒకనాటి అందాల నటి సుమలత మోహన్ బాబు వయస్సును టార్గెట్ చేస్తూ వేసిన సెటైర్లు అందరికీ నవ్వును తెప్పించాయి. ఇదే ఫంక్షన్ లో మోహన్ బాబు మాట్లాడుతూ తాను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు సుమలత సినిమాలను చూసే వాడిని అని కామెంట్ చేసాడు. దానికి సుమలత బదులు ఇస్తూ తన తల్లి గర్భంలో తాను ఉన్నప్పుడు తన తల్లి 'స్వర్గం నరకం' సినిమాను చూసిందని ఆ సినిమా విడుదల అయ్యాక పుట్టిన తన సినిమాలను మోహన్ బాబు డిగ్రీ చదువుతున్నప్పుడు ఎలా చూసాడు అంటూ మోహన్ బాబు తన వయస్సును దాచుకోవడానికి నానా పాట్లు పడుతున్నాడు అంటూ సెటైర్లు వేసింది. ఇదే ఆడియో వేడుకలో మోహన్ బాబు నేటితరం హీరోయిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోయిన్స్ రెండు మూడు సంవత్సరాలకే తిరిగి వెళ్ళి పోతున్నారని అలా కాకుండా రమ్యకృష్ణ మీనాలు ఈ నాటి తరం హీరోయిన్స్ కు పోటీ ఇస్తూ నటిస్తున్నారని కామెంట్ చేసాడు. అంతేకాదు తన కెరియర్ కు సంబంధించి రమ్యకృష్ణ మీనాలు బంగారం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు మోహన్ బాబు. ఇదే సందర్భంలో అల్లరి నరేష్ గురించి మాట్లాడుతూ నరేష్ అనుకున్న సమయానికి సెట్స్ కు రాడు అతడితో ఎందుకు గొడవ అంటూ తన వద్ద కామెంట్ చేసారని అయితే నరేష్ షూటింగ్ స్పాట్ కు తన కన్నా ముందు వచ్చి తనకు షాక్ ఇచ్చాడని దీనిని బట్టి ఒక హీరోను అణగ దొక్కడానికి సినిమా రంగంలో ఎటువంటి రూమర్స్ హడావిడి చేస్తాయో అర్ధం అవుతుంది అని అంటూ తన సినిమా సూపర్ హిట్ తో ఈ సంవత్సరానికి ముగింపు పలుకుతుంది అంటూ తన సినిమా పై నమ్మకాన్ని పెంచాడు మోహన్ బాబు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







