ఈ నెల 18న వైజాగ్ లో 'రంగస్థలం' ప్రీ రిలీజ్ ఫంక్షన్
- March 07, 2018
సమ్మర్ సీజన్లో వస్తున్న సినిమాల్లో రంగస్థలంపైనే అందరి చూపు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చిన మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుండటం ఒక కారణం. సుకుమార్-రామ్ చరణ్-సమంత కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ కావడం మరో రీజన్. ఈ సినిమా 1985 కాలం నాటి కథతో తెరకెక్కడం అన్నింటికంటే మెయిన్ రీజన్.
1985 బ్యాక్ డ్రాప్ లో సాగే రంగస్థలం మూవీని, అప్పటి కాలంలోకి ఆడియన్స్ వెళ్ళేలా సుకుమార్ ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నాడు. అందుకే షూటింగ్ మొత్తం గోదావారి జిల్లాలోనే విలేజ్ లోనూ, గోదావరి పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కువగా షూట్ చేశాడు. అవసరమైన చోట సెట్స్ వేసినా రియాలిటీగా ఉండేలా ప్లాన్ చేశాడు సుకుమార్. అందుకు ఈ సినిమా షూటింగ్ లేట్ అయ్యింది. ఈ లేట్ వల్లే సంక్రాంతి బరిలో దిగాల్సిన ఈ సినిమాని మార్చి 30న రిలీజ్ కి ఫిక్స్ చేసింది టీమ్.
ఇప్పటి వరకు ఎక్కువగా మాస్ ఓరియంటెడ్ సినిమాలే ఎక్కువగా చేసిన రామ్ చరణ్, ఇప్పుడు రంగస్థలంలోనూ మాస్ క్యారెక్టరే పోషించాడు. కాకపోతే 1985 బ్యాక్ డ్రాప్ కాబట్టి లుక్ తో పాటు డైలాగ్ డెలివరీ కూడా మార్చాల్సివచ్చింది. చెవిటి వాడైన చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. ఇక సమంత ఫస్ట్ టైమ్ కాస్త డీ గ్లామర్ రోల్ చేసిందని చెప్పొలి. రామలక్ష్మీగా సనంత కనిపిస్తోంది.
రంగస్థలంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్ రెడీ రిలీజైన రెండు పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక్క టీజర్లు కూడా అందర్నీ మెప్పించాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుపుకుంటున్న ఈ మూవీకి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఈ నెల 18న వైజాగ్ లో గ్రాండ్ గా జరపబోతున్నారు. సినిమాని ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తారు. చాలా కష్టపడి చేసిన ఈ సినిమా, ఆ టీమ్ కి ఎలాంటి మెమరబుల్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







