'ఇంటర్నేషనల్ సిటీ' కార్తీక వనభోజనాలు

- November 30, 2015 , by Maagulf


ఇంటర్నేషనల్ సిటీ, దుబాయ్ కుటుంబాల కార్తీక వనభోజనాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్మాత్మిక సందడి మధ్య ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. నవంబర్ 27న దుబాయ్లోని అల్కౌజ్ పాండ్ పార్క్లో ఈ కార్తీక వన భోజనాల్ని నిర్వహించారు. సుబ్రహ్మణ్యశర్మ ముఖ్య అతిథిగా పరిచయ కార్యక్రమం జరిగింది.శర్మ గారు కార్తిక మాసం వనభోజనాలు గురించి వివరించారు .ఆ తర్వాత కార్తీక వన భోజన కార్యక్రమానికి విచ్చేసిన వారంఆతా కలిసి విందు భోజనం సేవించారు. పద్మజ  కిషోర్ దంపతులు ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. భోజనం తర్వాత, పిల్లలు, మహిళలు, పురుషులకు, జంటలకు వివిడిగా పలు ఆటల పోటీలు నిర్వహించారు. డ్రా కూడా ఏర్పాటు చేశారు. విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందజేశారు.'లావాస్ సిల్వర్' వారు రాఫిల్ డ్రాకి స్పాన్సర్ చేసారు. ఇంటర్నేషనల్ సిటీ మెంబర్స్ ఎంతో ఉత్సాహంగా ఈ కార్తీక వన భోజనాల్లో పాల్గొన్నారు. కొత్త సభ్యులు, సీనియర్ సభ్యులను పరిచయం చేసుకున్నారు. విదేశాల్లో ఉన్నా స్వదేశీ సంప్రదాయాల్ని మర్చిపోకుండా కార్తీక వన భోజనాల్ని నిర్వహించినందుకు నిర్వాహకులకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలిపారు. 

మాగల్ఫ్.కామ్ వారి తరపున కార్యక్రమ సభ్యులకు ప్రత్యేక అభినంధనులు.

ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆశిస్తున్నాము.

 

 

 

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com