స్మిత్ కు రోబో సోఫియాతో బెడిసికొట్టిన డేటింగ్
- March 30, 2018కేమన్ ద్వీపం : హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ రోబో సోఫియాతో డేటింగ్‌కు వెళ్లారు. కేమన్ ద్వీపాల్లో సోఫియాతో గడిపిన క్షణాలను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు స్మిత్. మాటలతో ఆమెను పడేయాలనుకుని స్మిత్ వేసిన ఎత్తులు సోఫియా ముందు పారలేదు.

స్మిత్ : చాలా కాలం నుంచి నిన్ను కలవాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరిందంటూ వైన్‌ను సోఫియా ఇచ్చేందుకు ప్రయత్నం.
సోఫియా : వైన్‌ను తీసుకోలేదు. నాకూ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది.
స్మిత్ : జోక్ చెప్పడానికి యత్నం..
సోఫియా : హ్యూమర్ నాకు నచ్చదు
స్మిత్ : రోబో ఇష్టపడే మ్యూజిక్ ఏంటి?
సోఫియా : నన్ను సిలికాన్, ప్లాస్టిక్, కార్బన్ ఫైబర్లతో తయారు చేశారు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. హిప్-హాప్ మ్యూజిక్ కూడా వింటుంటాను.
స్మిత్ : నా సినిమాల్లోని పాటలంటే నీకు ఇష్టమేనా?
సోఫియా : నేను మీ పాటలు విన్నాను. కానీ అవి నాకు నచ్చలేదు.
స్మిత్ : కొద్దిగా ముందుకు జరిగి ముద్దు పెట్టబోయారు.
సోఫియా : వద్దని వారించి.. మిమ్మల్ని నేను స్నేహితుడిగా భావిస్తున్నాను అంటూ కన్నుగీటింది.

హాంకాంగ్‌కు చెందిన హాన్‌సన్ రోబోటిక్స్ సోఫియాను తయారు చేసింది. మనుషుల హావభావాలను తెలుసుకుని మసులుకునేలా అభివృద్ధి చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







