మిషన్ భగీరథ గ్రిడ్‌ను ప్రారంభించిన కేటీఆర్
- March 30, 2018
వనపర్తి: తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ డిపో నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 22వ వార్డులో పార్కు నిర్మాణం కోసం కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు.. వనపర్తి సెగ్మెంట్లో రూ. 345 కోట్లతో జిల్లాలోని కనాయిపల్లిలో నిర్మించిన మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మిషన్ భగీరథ గ్రిడ్‌తో గ్రామాన్ని అనుసంధానం చేసే పనులను ఆయన ప్రారంభించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







