అభిరామ్ దగ్గుబాటి పై శివాజీరాజా స్పందన
- April 13, 2018
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ పై సినీనటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తూ ఓ ఫొటోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, కొన్ని టీవీ ఛానెళ్లలోనూ పదే పదే చూపించారు. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు. టాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం శివాజీ రాజా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కోన వెంకట్, అభిరామ్ గురించి స్పందించాలని విలేకరులు కోరగా.. దీంతో శివాజీ రాజా మాట్లాడుతూ... 'కోన వెంకట్ తో మాకు సంబంధం లేదు.. ఇక అభిరామ్ నటుడు కాదు, నిర్మాత కాదు మాకు సంబంధం లేని విషయం అది' అని వ్యాఖ్యానించారు. కాగా, తాము తెలుగు ఆర్టిస్టులను ప్రోత్సహించడం లేదని శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తెలుగు ఆర్టిస్టులను టాలీవుడ్ ప్రోత్సహిస్తూనే ఉందని అన్నారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







