నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2018 : శ్రీదేవి, వినోద్ ఖన్నా లకు అవార్డులు
- April 13, 2018
భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అద్భుతమైన నటుల్లో అందాల తార శ్రీదేవి, వినోద్ ఖన్నా ఒకరు. వీరిద్దరూ ఈ లోకంలో లేకపోయినా చిత్ర పరిశ్రమ, అభిమానుల గుండెల్లో మాత్రం చిరకాలం నిలిచిపోయేంతగా పేరు తెచ్చుకున్నారు. హఠాన్మరణంతో సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టిన శ్రీదేవికి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించగా..అనారోగ్యంతో చనిపోయిన వినోద్ ఖన్నాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది.
అయితే ఈ సారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 15 మంది ప్రముఖుల పేర్లను పరిశీలించింది. చివరికి అవార్డును వినోద్ ఖన్నాకు ఇవ్వాలని నిర్ణయించింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో శ్రీదేవి నటించిన తొలి చిత్రం 'ఇంగ్లిష్ వింగ్లిష్'. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆమె తమిళంలో వచ్చిన 'పులి', భర్త బోనీ కపూర్ నిర్మించిన 'మామ్' చిత్రాల్లో నటించారు. 'మామ్' సినిమాలో శ్రీదేవి నటనకు గానూ జాతీయ అవార్డు లభించింది.
శ్రీదేవి ఉండుంటే బాగుండేది: బోనీ
శ్రీదేవికి జాతీయ అవార్డు రావడంతో బోనీ కపూర్ హర్షం వ్యక్తం చేశారు. 'నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తానిక్కడ ఉండి ఉంటే బాగుండేది. శ్రీదేవి అందుకున్న తొలి జాతీయ అవార్డు ఇది. చాలా విషయాలు గుర్తుకు వస్తున్నాయి.' అని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఆస్కార్ సమయంలోనూ..!
ఇటీవల అమెరికాలోని లాస్ఏంజెల్స్‌లో జరిగిన 'ఆస్కార్' అవార్డుల వేడుకలోనూ శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు. అవార్డు కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రముఖ అమెరికన్ మ్యుజీషియన్ ఎడ్డీ వెడ్డర్ శ్రీదేవి, శశి కపూర్ కోసం పాట పాడి నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







