తారక్ ఇంట్లో చెర్రీ దంపతులు.. అభయ్ రామ్ పాటకు ఫిదా..!
- May 05, 2018
తారక్ మరియు చెర్రీలు ఈ మధ్య కాలంలో కలుసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటివలే తారక్, చెర్రీలు మహేష్‌తో కలసి ఓ పార్టీలో సందండి చేశారు. సమయం ఉన్నప్పుడు చెర్రీ, తారక్‌లు బయట పార్టీలో మీట్ అయ్యి ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా చెర్రీ తన ఫ్రెండ్ తారక్ ఇంటికి వెళ్లి అక్కడ సందడి చేశాడు.
శనివారం తారక్, ప్రణతి దంపతుల పెళ్లి రోజు కావడంతో ఈ వేడుకకు చెర్రీ దంపతులు హాజరయ్యారు. తారక్ దంపతులతో కేక్ కట్ చెయించారు. అలాగే తారక్ తనయుడు అభయ్ రామ్‌తో సరదాగా గడిపారు. 'నాన్నకు ప్రేమతో' సినిమాలోని ‘ఐ వనా ఫాలో ఫాలో యూ’ అంటూ అభయ్ ముద్దు ముద్దుగా పాడుతుంటే చెర్రీ దంపతులు ఫిదా అయ్యారు. వారు అందరు కలసి ఎంజాయ్ చేసిన ఫొటోలను ఉపాసన తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలతో పాటు అభయ్ పాడిన పాట వీడియోను కూడ ఆమె ఫోస్ట్ చేసింది. ఉపసాన ట్వీట్‌కి నెటిజన్లు స్పందిస్తూ తండ్రికి మించిన తనయుడు అంటూ.. ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







