న్యూయార్క్‌లో షూటింగ్ జరుపుకుంటున్న 'సవ్యసాచి' టీమ్

- May 06, 2018 , by Maagulf
న్యూయార్క్‌లో షూటింగ్ జరుపుకుంటున్న 'సవ్యసాచి' టీమ్

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సవ్యసాచి'. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీ టీంతో దిగిన ఓ ఫోటోను చైతు ట్విట్టర్లో పోస్టు చేశారు. న్యూయార్క్ సిటీతో ఎప్పుడూ పాజిటివ్ కనెక్షన్ ఉంటుందని తెలిపారు.

మే 12 వరకు చైతు, నిధి అగర్వాల్ పై సాంగ్‌తో పాటు కమెడియన్లు షకలక శంకర్, వెన్నెల కిషోర్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లే.

'సవ్యసాచి' అంటే రెండు చేతులని సమర్ధవంతంగా, శక్తివంతంగా ఉపయోగించేవాళ్లు అని అర్థం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మాధవన్, భూమికలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

జూన్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ ఇందులో కథానాయికగా నటిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సవ్యసాచితో పాటు మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు అనే చిత్రం చేస్తున్నాడు చైతూ. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని టాక్. వీటి తర్వాత తన సతీమణి సమంతతోనూ ఓ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com