"నేల టిక్కెట్టు" ట్రైలర్ అదుర్స్
- May 17, 2018
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి, యాక్షన్, వెటకారపు డైలాగులు, మంచి ఎమోషన్లు ఇలా అన్నీ ఉంటాయి. కుటుంబం మొత్తం సరదాగా కలిసి చూసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. ఇక కళ్యాణ్‌కృష్ణ తీసింది రెండు సినిమాలే అయినా తనకంటూ ఒక క్లాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. మంచి కథాకథనంతో సరదాగా సాగిపోతూ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండించే సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు రవితేజతో 'నేల టికెట్టు' తీస్తున్నారు. మరి ఒక మాస్ హీరో ఒక క్లాస్ దర్శకుడు కలిసి పని చేస్తే ఎలా ఉంటుంది? చాలా ఆసక్తి రేపిన ఈ ప్రశ్నకి నిన్న విడుదల చేసిన సినిమా ట్రైలర్ సమాధానం చెప్పేసింది. 'ఫస్ట్ టైం లైఫ్ లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఒక కొత్త రిలేషన్ కనిపిస్తుంది.' 'చుట్టూ జనం మధ్యలో మనం, అది కదరా లైఫ్' 'ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసే వాడు ఒక్కడు లేడు' 'ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం'లాంటి అద్భుతమైన అర్థవంతమైన కళ్యాణ్‌కృష్ణ మార్కు క్లాస్ డైలాగులు ఒక వైపు..'నువ్వు రావటం కాదు.. నేనే వస్తున్నా.. ఇదే మూడ్ మెయిన్టైన్ చెయ్' 'నేల టిక్కెట్టు గాళ్లతో పెట్టుకుంటే.. నేల నాకించేస్తారు"లాంటి ఈలలు వేయించే రవితేజ మార్కు మాస్ డైలాగులు మరో వైపు చూస్తుంటేనే అర్థం అయిపోతుంది ఈ సినిమా క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతీ ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని తీసారని.
మే 25న విడుదల..
మే 25న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ,ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







