మీ కళ్లు అలసిపోతున్నాయా ?
- December 08, 2015
మీ కళ్లు అలసిపోతున్నాయా ? తరచుగా ఎర్రగా మారుతున్నాయా ? మీ కళ్లు దురదగా ఉంటున్నాయా ? అలాంటప్పుడు వెంటనే కళ్లకు రిలీఫ్ ఇవ్వాలనిపిస్తుంది కాదూ. ఇలా అలసటకు గురై.. ఒత్తడికి లోనవుతున్న కళ్లకు ఉపశమనం కలిగించడానికి సహజ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. నయనం ప్రధానం అన్నారు. ఎన్నెన్నో అందాలను.. ఆకర్షణీయమైన ప్రపంచాన్ని చూడాలంటే కంటి ఆరోగ్యం బాగుండాలి. అవి ప్రమాదానికి గురైతే.. మూడ్ తోపాటు పనికి కూడా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ చెబుతున్న అమేజింగ్ టెక్నిక్స్ ఫాలో అయి చూడండి.. మీ కళ్లు ఎంత బాగా సేదతీరుతాయో. వందేళ్ళ కంటి చూపుకోసం తినండి విటమిన్ రిచ్ ఫుడ్స్ పని ఒత్తిడి, దూరప్రయాణాలు, బైక్ ల మీద జర్నీలు, కంప్యూటర్ల మీద గంటల తరబడి పనిచేయడం, స్మార్ట్ ఫోన్లలతో ఎక్కువ సేపు గడపటం.. ఇలా రకరకాల కారణాల వల్ల కళ్లు అలసటకు లోనవుతుంటాయి. కారణమేదైనా.. సున్నితమైన కళ్లపై శ్రమ మాత్రం పెరుగుతోంది. కాబట్టి అలసిపోతున్న కళ్లకు సాంత్వన ఇవ్వడానికి చక్కటి హోం రెమిడీస్ మీ కోసం..మీ కళ్లకు నూతనోత్తేజం కలిగించాలంటే.. కంటినిండా నిద్రపోవాలి. రోజుకి 7గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. సరిగా నిద్రలేకపోతే.. కళ్లు అలసిపోతాయి.. ఒత్తిడికి గురవుతాయి. ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా నిద్ర ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు కళ్లను శుభ్రం చేసుకుంటే బాగా నిద్రపడుతుంది. టీ తాగిన తర్వాత టీ బ్యాగ్ లను వేస్ట్ చేయకండి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే టీ బ్యాగులను నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టి తర్వాత కళ్లపై పెట్టుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. దోసకాయ ముఖ్కలను కళ్లపై కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తర్వాత కళ్లపై పెట్టుకుంటే.. అలసిపోయిన కళ్లకు ఉపశమనం కలుగుతుంది. చాలా ఈజీ పరిష్కారం. శుభ్రంగా ఉన్న నీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. కంటిని ఆ నీటిలో ముంచుతూ.. కళ్లు తెరవాలి. దీనివల్ల కళ్లలో ఉన్న దుమ్ము, దూళి బయటకు పోతాయి. ఈ పద్ధతి ఈజీగా.. ఇంట్లో చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కంటికి అవసరమైన ఉపశమనం త్వరగా.. ఈజీగా పొందడానికి ఈ రెమెడీ బాగా ఉపయోగపడుతుంది. దోసకాయ రసంలో ముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని రాత్రంగా అలాగే ఉన్నా మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల కళ్ల చుట్టూ వాపును కూడా తగ్గిస్తుంది. కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు పోవడానికి ఆలూ ఉపయోగపడుతుంది. ఆలూ నుంచి తీసిన రసాన్ని కొంతసేపు ఫ్రిజ్ లో ఉంచాలి. అవి చల్లబడిన తర్వాత కళ్లచుట్టూ అద్దుకోవాలి. కళ్లను అప్పుడప్పుడు మసాజ్ చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరగడమే కాదు.. కళ్ల చుట్టూ ముడతలు తగ్గి ఫ్రెష్ గా కనిపిస్తాయి. చూపుడు వేలితో కంటి చుట్టూ సున్నితంగా మర్దనా చేయాలి. కొన్ని సందర్బాలలో కళ్లలో దురద విపరీతంగా ఉంటుంది. అలాంటప్పుడు కంటి డాక్టర్ సూచించిన ఐ డ్రాప్స్ ని వాడాలి. ఐ డ్రాప్స్ మూత ఓపెన్ చేసిపెట్టినవి.. చాలా కాలం తర్వాత వాడితే.. ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి. కాబట్టి కళ్ల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్‌లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







