ఫిక్స్ అయిన సైరా రిలీజ్ డేట్..!
- June 03, 2018
పదేళ్ల తర్వాత కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఖైది నంబర్ 150గా రీ ఎంట్రీ ఇచ్చి అప్పటిదాకా ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్ని తిరగరాశాడు. వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఖైది నంబర్ 150 తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్ లో రాం చరణ్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఆ సినిమా ఇచ్చిన హిట్ జోష్ తో చిరు ఈసారి పెద్ద ప్రాజెక్ట్ షురూ చేశారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా సైరా నరసింహారెడ్డి గా రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ లాంటి వారు నటిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా జరుపుకున్న ఈ సినిమాను ఎలాగైనా 2019 సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సమ్మర్ లో హిట్ టాక్ వస్తే ఆ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించినట్టే. ఈ ఇయర్ వచ్చిన రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి సమ్మర్ స్మాషింగ్ హిట్ సాధించాయి. ఎలాగు హాలీడేస్ కాబట్టి సినిమా బాగుంది అంటే కచ్చితంగా సినిమా చూసేస్తారు.
అందుకే వచ్చే సమ్మర్ లో సైరా అనేందుకు సిద్ధమవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తనకు ఈ రికార్డులు కొత్తేమి కాదు కాని కుర్ర హీరోలకు పోటీగా తన సత్తా చాటేందుకు చిరు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈమధ్యనే సైరా నుండి లీక్ అయిన కొన్ని పిక్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్న కూడా నటిస్తుందని తెలుస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







