అగ్ని -5 క్షిపణి పరీక్ష విజయవంతం

- June 03, 2018 , by Maagulf
అగ్ని -5 క్షిపణి పరీక్ష విజయవంతం

భువనేశ్వర్‌ : ఒడిశా తీరంలోని డాక్టర్‌ అబ్దుల్‌ కలాం దీవి నుండి ప్రయోగించిన అగ్ని -5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ప్రయోగించిన క్షిపణి పరీక్ష విజయవంతం అయిందని రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. అణు బాంబులను మోసుకుని వెళుతూ, 5 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఇది సులువుగా ఛేదిస్తుందని వెల్లడించారు. లాంచ్‌ ప్యాడ్‌-4 పై నుంచి ఉదయం 9.48 గంటల ప్రాంతంలో దీన్ని ప్రయోగించామని, పూర్తి దూరాన్ని ఇది ప్రయాణించి, లక్ష్యాన్ని తాకిందని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటివరకూ అగ్ని-5 క్షిపణిని డీఆర్డీఓ (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ ఆర్గనైజేషన్‌) ఆరు సార్లు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. తొలి పరీక్షను 2012 ఏప్రిల్‌ 19న జరుపగా, ఆరవదైన అగ్నిా 5 క్షిపణిని ఈ సంవత్సరం జనవరి 18న ప్రయోగించింది. క్షిపణి వెళ్లిన మార్గాన్ని, వేగాన్ని రాడార్లు, ట్రాకింగ్‌ పరికరాలు, అబ్జర్వేషన్‌ స్టేషన్లు అనుక్షణం పరిశీలించాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com