వ్యాట్, కార్పొరేట్ మరియు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు? ఎంత?
- December 09, 2015
ఇంధన ధరల స్థిరీకరణ తర్వాత యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ సెక్రెటరీ యూనిస్ హజి అల్ ఖౌరి, జిసిసి దేశాలు వ్యాట్‌ను అమలు చేయాలనే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు యూఏఈ సహా పలు జిసిసి దేశాలకు ట్యాక్స్‌ని ఇంపోజ్ చేయడం తప్పనిసరిగా సూచించాయి. తక్కువ రేట్ వ్యాట్ని ఐఎంఎఫ్ సూచించింది. అది ఐదు శాతంగా ఉంది. అలాగే 15 శాతం ట్యాక్స్‌ను కార్లపై విధించాలని కూడా ఐంఎఫ్ యూఏఈకి సూచించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి పర్సనల్ ట్యాక్స్‌పై స్పష్టత లేనప్పటికీ, అది కూడా భవిష్యత్తులో విధించే అవకాశాలున్నాయి. ఆదాయాన్ని రాబట్టుకునే క్రమంలో వ్యాట్‌తోపాటు కార్పొరేట్ ఆదాయపు పన్ను విధిస్తే ఎలా ఉంటుంది? అన్న కోణంలో కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న విధానాల ప్రకారం కార్పొరేట్ ఇంకమ్ ట్యాక్స్ 20 శాతంగా విదేశీ బ్యాంకుల నుంచి లెవీ చేయబడ్తోంది. లోకల్ మున్సిపల్ ప్రాపర్టీ టాక్స్ 5 శాతంగా ఉంది. హోటల్ సర్వీసులపై 10 శాతం సర్వీస్ ట్యాక్స్ అమల్లో ఉంది. జిసిసి కామన్ ఎక్స్టర్నల్ టారిఫ్ (ఇందులో 5 శాతం జనరల్ రేట్, 50 శాతం ఆల్కహాల్ మీద, 100 శాతం పొగాకు ఉత్పత్తులపైనా ఉంది). అలాగే ఎక్సయిజ్ డ్యూటీ ప్రయాణీకుల రవాణా వాహనాలపైనా, ప్రభుత్వ సర్వీసుల మీద ప్రతిపాదిత రుసుము అమల్లో ఉంది. కొత్త పన్నుల ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడం తప్పకపోవచ్చు. అయితే ఆ నిర్ణయం కోసం ఇంకా కొంత కాలం వేచి చూడక తప్పదు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







