ఆరుగురికి 'సుల్తాన్‌' కల్చరల్‌ అవార్డ్స్‌

- December 11, 2015 , by Maagulf
ఆరుగురికి 'సుల్తాన్‌' కల్చరల్‌ అవార్డ్స్‌
 
 
 
14వ సుల్తాన్‌ బిన్‌ అల్‌ ఒవైస్‌ కల్చరల్‌ అవార్డులను ఈ సంవత్సరం ఆరుగురికి అందించనున్నారు. సుల్తాన్‌ బిన్‌ అలీ అల్‌ ఒవైస్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌, ఎమిరేట్‌ కవి సుల్తాన్‌ బిన్‌ అలీ అల్‌ ఒవైస్‌ పేరు మీద ఈ అవార్డుల్ని ప్రతి యేటా అందిస్తోంది. అరబ్‌ స్కాలర్స్‌, లిటరేచర్స్‌ మరియు ఇంటలెక్చువల్స్‌కి ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతోంది. ఫౌండేషన్‌ జనరల్‌ సెక్రెటరీ డాక్టర్‌ మహమ్మద్‌ అబు అల్లా అల్‌ మొతావా మాట్లాడుతూ, న్యాయ నిర్ణేతలు 1,575 మంది అభ్యర్థుల నుంచి ఆరుగుర్ని విజేతలుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. పోయెట్రీ ప్రైజ్‌ విభాగంలో హబీబ్‌ అల్‌ సయేగ్‌ అవార్డును అందుకోనున్నారు. యూసుల్‌ అల్‌ అకీద్‌ మరియు ఇస్మాయిల్‌ ఫహాద్‌ ఇస్మాయిల్‌ షార్ట్‌ స్టోరీ, నవల్‌ మరియు డ్రామా కేటగిరీలో అవార్డుకు ఎంపికయ్యారు. లిటరేచర్‌ స్టడీస్‌ క్రిటిసిజమ్‌ కేటగిరీలో సలాహ్‌ ఫదీల్‌ మరియు కమల్‌ అబు అదీబ్‌ అవార్డును అందుకోనుండగా, హుమానిటేరియన్‌ మరియు ఫ్యూచర్‌ స్టడీస్‌ విభాగంలో రష్దీ రషీద్‌ అవార్డును అందుకుంటారు. మార్చ్‌లో ఈ అవార్డులను బహుకరించే కార్యక్రమం జరగనుంది. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com