కేవలం 13 నిమిషాలలో మీ వద్దకు దుబాయ్ టాక్సీ

- December 12, 2015 , by Maagulf
కేవలం 13 నిమిషాలలో మీ వద్దకు దుబాయ్ టాక్సీ


   దుబాయ్ రహదారులు మరియు రవాణా అధికార సంస్థ గణాంకాల ప్రకారం 2015 జనవరి నుంచి  అక్టోబర్ మధ్య కాలంలో టాక్సీల కోసం 7,257, 944  ఫోనేకాల్ల్స్ వచ్చినట్లు సంబంధిత అధికారులు  తెలిపారు. ఇదే సమయంలో 5,060,550 టాక్సీలను కిరాయిలకు తీసుకున్నారని తెలిపారు. మరియు  88,029,480 టాక్సీలు వివిధ ప్రాంతాలకు వెళ్ళాయి. ప్రస్తుతం నూతన  ఐ .వి . ఆర్ . విధాన సేవలను   ప్రవేశపెట్టడం వలన టాక్సీను  బాడుగకు పొందగోరేవారు బుకింగ్ నమోదుతో పాటు , రద్దు చేసుకొనే  అవకాశం  ఐ .వి . ఆర్ . విధానం ద్వారా కూడా చేయవచ్చు. ఆయా సమాచారం ను  టెక్స్ట్ మెసేజ్ ద్వారా పర్యాటకులకు పంపనున్నారు. టాక్సీ ను  బుక్ చేసేతప్పుడు పర్యాటకులు  టాక్సీ తమ వద్దకు రావాల్సిన సమయం మరియు అడ్రస్ తెలపాలని  అదే విషయాన్ని టెక్స్ట్ మెసేజ్ రూపం లో గాని , వాయిస్ రికార్డింగ్ తో  కూడిన మెసేజ్ ను పంపవచ్చు. అలాగే, పర్యాటకులు ఏ విధమైన సేవలను  పొందగోరచున్నారో ముందుగా తెలియచేయాలని కోరారు. ఉదాహరణకు  అంగవైకల్యం ,  మహిళలు , చిన్నపిల్లలు, కుటుంబసభ్యులు తదితరులు ఉన్నట్లయితే మరిన్ని మెరుగైన సేవలను పొందవచ్చని  దుబాయ్ రహదారులు మరియు రవాణా అధికార సంస్థ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com