రష్యా క్షిపణికొనుగోళ్లపై ఆంక్షల ప్రభావం నిల్
- July 14, 2018
న్యూఢిల్లీ: రష్యాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ రక్షణరంగానికి సంబం ధించిన ఎస్-400 వైమానిక క్షిపణుల కొనుగోలు డీల్ కొనసాగుతుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రష్యాపై అమెరికా మిలిటరీ ఆంక్షలువిధించినా ఈ రక్షణరంగ క్షిప ణుల డీల్ మాత్రం ముందుకువెళుతుందని మంత్రి వెల్లడించారు. ఆంక్షల చట్టం ప్రకారం అమెరికా నుంచి ప్రతికూలతలు ఉననప్పటికీ ఆచట్టం అమెరికా చట్టమని, ఐక్యరాజ్యసమితి చట్టంకాదని, భారత్ తనవైఖరిని ఇప్పటికే అమెరి కాకు స్పష్టంచేసిందని అన్నారు. భారత్ రష్యా రక్షణ సంబంధాలు కొనసాగుతాయని, అనేక దశాబ్దాలనుంచి పటిష్టంగా ఉన్నాయన్నారు. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందానికి భారత్ తన రష్యా క్షిపణుల కొనుగోలువైఖరిని స్పష్టం చేసిందని గుర్తుచేసారు. రష్యాతో ఎస్.400 క్షిప ణుల డీల్ ముగింపుదశకు వచ్చిందని అన్నారు. రెండున్నర లేదా నాలుగేళ్లలో ఎస్- 400 క్షిపణులు భారత్‌కు అందుతాయని ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని అన్నారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







