ఇరాన్ అణు ఒప్పందానికి కట్టుబడ్డాం : తేల్చి చెప్పిన రష్యా, చైనా
- August 18, 2018
మాస్కో : ఇరాన్ అణు ఒప్పందానికి కట్టుబడి వుంటామని రష్యా, చైనా స్పష్టం చేశాయి. అమెరికా కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇరాన్‌తో తమ సంబంధాలను, సహకారాన్ని కొనసాగిస్తామని తెలిపాయి. 2015లో కుదిరిన సంయుక్త సమగ్ర కార్యాచరణ ఒప్పందం (జెసిపిఓఎ) పూర్తి స్థాయి అమలుకు, ఒప్పందాన్ని పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరాన్ అణు ఒప్పందం అవసరాలకు అనుగుణంగా రష్యా అణు ఇంధన సహకార సంస్థ పలు ప్రాజెక్టులు చేపడుతోందని తెలిపింది. అణు ఇంధన శాంతియుత ప్రయోజనాల కోసం నిర్దిష్ట రంగాల్లో ఇరాన్‌కు సహకారం అందిస్తామని రష్యా హామీ ఇచ్చింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ విడిగా ఒక ప్రకటన చేస్తూ ఇరాన్‌తో తమ సంబంధాలు, సహకారం యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన వాంగ్, ఈ ఒప్పందం అంతర్జాతీయ మానవాళి ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా వుందన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







