లెంకు తున్న....!
- December 17, 2015
పర్రెలు శాపినా నా తెలంగాణా భూములకు
గొంతులెండిన నా ముద్దు బిడ్డలకు నీళ్ళ కోసం లెంకు తున్న
పొట్ట కూటి కోసం కన్నా కడుపుని సంపు కుని
నా లంబాడీ తల్లులు అమ్ముకున్న పసికూనల కోసం లెంకు తున్నా...
ఉధ్యమ ఉప్పెనలో అగ్గిని ముద్దాడుతూ అమరులైన
విద్యార్థి బిడ్డల గురించి నా కంకాలాల అంటూ
ఏడ్చి ఏడ్చి ఇంకి పోయిన నా అవ్వ కళ్ళలోని కన్నీళ్ళ కోసం లెంకు తున్న...
బతుకు దెరువుకు పోయి నాలుగేండ్లకు నా ఊరికొచ్చి చూస్తే
ఓపెన్ క్యాస్టులంటు, బొగ్గు బాయి బొంధలతో మాయమైన
నా ఊరి పక్క పల్లె గురించి లెంకు తున్నా....
బతుకమ్మ పండుక్కి ఇంటికొచ్చిన చెల్లి కోసం
తంగేడు పూల కోసం, గునుగు పూల కోసం
మాయమవుతున్న నా అడవి తల్లి ఒడిలో లెంకు తున్న..
నా ఊళ్ళో నీళ్ళ కోసం ఆరవయ్యారు బోర్లెసి
అప్పులపాలై బొర్ల బుచ్చి రెడ్డి గా దుబాయి చేరి కూలీ గా మారిన
గడ్డం బుచ్చి రెడ్డి గురించి లెంకు తున్నా....
ఖద్దరు బట్టల రూపం కోసం
తమ బొక్కల్ని యంత్రాలను చేస్తూ...ఆగిపోయిన
నా సిరిసిల్ల లోని ఘల్లి ఘల్లి లో వినిపించే
టక్ టక్ చప్పుడు కోసం లెంకు తున్నా...
కాలే కడుపులతో ఎడారి దేశం ఎగిరోచ్చి
విగథ జీవులుగా మారి శవాల గధుల్లొ
కదలకుండా ఉన్నా నా తెలంగాణా బిడ్డల గురించి లెంకు తున్న
--ముస్కు రాము(అబుధాబి)
తాజా వార్తలు
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!







