మదిని మీటిన వర్షం-పార్ట్-8

- December 17, 2015 , by Maagulf

జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు ఇద్దరి మొహాల్లో చాల ఆనందం… అందరు అక్షింతలు వేస్తున్నారు … అటు వైపు నందు పక్కన తను ఇటు పక్క నేను అక్షింతలు మధ్య చూపులతో తనను పలకరించడానికి ప్రయత్నిస్తున్న… తన చూపులు నన్ను తికమక పెడుతున్నాయి ఇంత సేపు ఎదురుగా ఉనప్పుడు కోపం తో ఉన్న కళ్ళు ఇప్పుడు అక్షింతల మధ్య ప్రేమగా చూస్తున్నాయి … అక్షింతలు అయిపోగానే మళ్లీ కోపం …. ఇంతలో పంతులు నా చేయి పట్టుకొని పక్కకు జరిపాడు ఈ బాధలో అక్షింతలు తన మీద వేస్తున్న… “నాయన అమ్మాయిని తరువాత చూడొచ్చు ముందు అక్షింతలు సరిగ్గా వెయ్యి నాయన, నాకు అక్షింతలు వేయించుకునే వయసు దాటిపోయింది” అని మైక్ లో గట్టిగా చెప్పాడు మొహం మీద పడిన అక్షింతలు తుడుచుకుంటు పరువు హోల్ సేల్ గా పోయింది, తల గోక్కుంటూ జుట్టు పీక్కుంటూ కిందకి దిగుతూ వెనక్కి తిరిగి చుస పంటి కింద పెదాలు పెట్టుకొని చిన్న చిరునవ్వుతో ప్రేమగా చూస్తోంది నేను తల తిప్పగానే మళ్లీ కోపం … సారీ చెప్తాం అంటే ఇటు సైడ్ చూడదు సరిగ్గా ఎలా కన్విన్సు చేయడం అని ఆలోచిస్తూ… ఇంతలో అక్షింతల ప్లేట్ పట్టుకొని ముందు వరసలో అందరికి ఇస్తోంది తను, ఎవడో గొట్టం గాడితో నవ్వుకుంటూ మాట్లాడేస్తా ఉంది నేను చూస్తున్న అని తెలిసి రెండు మూడు సార్లు వాడి సైడ్ చూసి స్మైల్ ఇచ్చింది నాకు ఎక్కడో కాల్తోంది ఆత్మ రాముడు ఎకిలి నవ్వులు నవ్వుతున్నాడు కడుపు మండిపోతుంది … "రేయ్ రాజు ఆపరేషన్ వర్ష స్టార్ట్ చేయాలి పద అని వాడి చెవిలో ఎం చేయాలో ఊదాను… రాజు గాడు వెళ్లి చేతిలో కాఫీ గ్లాస్ తో ఆ అభినవ రోమియో పక్కగా నడుస్తున్నాడు నేను వెళ్లి రాజు గాన్ని వాడి మీదకి తోసా చేతిలో ఉన్న కాఫీ వాడి మీద ఒలికి పోయింది …. "ఓహ్ సారీ భయ్యా చూసుకోలేదు నేను అని చెప్పాడు రాజు గాడి పర్సనాలిటీ చూడగానే పర్లేదు బ్రదర్ అంటూ వెళ్లిపోయాడు నా ప్లాన్ వర్క్ అయింది అని సంతోష పడేలోపల ఆ రోమియో వెనక్కి తిరిగి నా దగ్గరికి వచ్చి “చూడండి భరత్ ఇది మీరు కావాలని చేసారు అని తెలుసు బై ది వే నా పేరు సుధీర్ వర్ష నా కజిన్ తను సంతోషంగా ఉండడం చూసి చాల రోజుల అయింది కారణం మీరే అని ఇప్పుడే మీ గురించి చెప్పింది.. " చేసిన తప్పుకి పశ్చాతాప్పం పడుతునట్టు మొహం పెట్టాను " మీ బాధ అర్థం అయింది లెండి ఇంకా నయం కాఫీతో సరిపెట్టారు అదే ఏ కాలేజీ ఫంక్షన్ అయింటే ఆసిడ్ తెచ్చి పోసేవాళ్ళ ఏంటి ?” అని నవ్వుతు వెళ్ళిపోయాడు నేను ఒకసారి తిరిగి చూసా వర్ష నవ్వుతోంది నేను చేసిన తిక్క పని చూస్తూ పరిగెత్తుకుంటూ సుధీర్ దగ్గరికి వెళ్లి "సారీ బ్రదర్ నైస్ తో మీట్ యు తొరగా రెడీ అయి రండి మీ కోసం వెయిట్ చేస్తుంటాము" అని చెప్పి వచ్చి తనని చూస్తున్న తను నా సైడ్ చూసింది సారీ చెప్పాను …. మెల్లగా నవ్వుతు తల ఓకే అనట్టుగా ఊపింది … నాదస్వరం విన్న పాము లాగ పుంగి కి తగట్టు నేను స్లో మోషన్ లో తల ఊపుతున్న… అభి గాడు స్టేజి పైకి పిలిచాడు “రేయ్ నువ్వు ఇక్కడే కూర్చో వీళ్ళంతా ఏడిపిస్తున్నారు బాగా వర్ష కూడా కౌంటర్లు వేస్తోంది బండది చంపేస్తోంది” వాళ్ళ మధ్యలో అభి గాడి వెనక సెట్ అయ్యాను… అందరి కాన్సంట్రేషన్ నా మీదకి వచ్చింది పగ తీర్చుకోవడానికి బండది అందరి చెవిలో ఏదో ఊదుతోంది ఒక సారిగా మండపం పోయి జంతు ప్రపంచం ఛానల్ లాగ అయింది 10 అడవి పందుల మధ్య చిన్న కుందేలు పిల్ల ఇరుక్కు పోయిన ఫీలింగ్ వచ్చింది…ఒక సారి వెనక్కి తిరిగి చూసా " రా రా అని" చంద్రముఖి మొహాలు కనపడ్డాయి
పెళ్లి మంత్రోచ్చారణలు శ్రద్ధగా వింటున్నాము … తమకు ఈ పెళ్లి సమ్మత సూచకంగా పెళ్లి జంట దండలు మార్చుకున్నారు, జీవితంలో సుఖ సంతోషాల కోసం జీవిత పరమార్థం కోసం ధర్మార్థ కామ మోక్షాల విశిష్టత గురించి వివరిస్తున్నాడు "ధర్మేచ, అర్తేచ, కామేచ, మోక్షేచ్చ .. నాతి చరామి!!! అని చెప్పించాడు" కన్యాదానం జరిపించేటప్పుడు అంకుల్ కళ్ళల్లో ఒక చిన్న బాధ అభి చేతిలో నందు చేయి పెట్టి అంకుల్ చేతిలో పాలు పోస్తున్నారు అవి నందు చేతి మీద నుంచి అభి చేతుల్లోకి పడుతున్నాయి నా ఇంటి లక్ష్మిని నీ ఇంటి గృహలక్ష్మిగా నీ చేతుల్లోకి పెడుతున్న సుఖమైన కష్టమైన ఇక తన భాద్యత అని … తమ బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని నందు తరపున వాళ్ళు అందరు నందు చేతిలో పాలు పోస్తూ తనని అభికి అప్పగిస్తూ పెళ్ళికి సాక్షిభూతులు లాగ నిలుస్తున్నారు…పెళ్లి తంతు అలాగే ముందుకు సాగుతుంటే నెత్తి మీద ఒక దెబ్బ పడింది వెనక్కి తిరిగి చూస్తే అందరు ఏమి తెలియనట్టు కూర్చున్నారు…ఈసారి చెవిలో ఏదో పెట్టి గెలుకుతున్నారు చూస్తే మళ్లీ అదే సీన్, మళ్లీ ఇంకో దెబ్బ పడింది వెనక్కి తిరగగానే “అరె ఏమయింది మన భరత్ గాడి గుండు పగిలింది" అని రీమిక్స్ సాంగ్ పాడుతున్నారు … నందు పక్కన కుర్చుని చూస్తున్న వర్ష పడి పడి నవ్వుతోంది నేను కొంచం కళ్ళు కోపం చేసి చూసా… తను ఎర్ర తలంబ్రాల ప్లేట్ చూపించింది …. ఈసారి ఇంకో దెబ్బ కొట్టారు వెనక్కి తిరిగితే అందరు కొన్ని అక్షింతలు తీసుకొని నా మీద చల్లుతూ "నీ పాపం పండెను నేడు నీ భరతం పడతాం చూడు" అని సాంగ్ ... ఇటు తిరిగి చూస్తే పంతులు కూడా అలీ స్టైల్ లో నాలిక బయట పెట్టి ఎకిరిస్తున్నాడు.. "రేయ్ అభి గా ఏంట్రా నాకు ఈ టార్చర్ నన్ను పిలిచి ఈ ఆడ శివంగుల మధ్య పడేసావు కదరా ఆడుకుంటున్నారు" "అన్నయ వర్ష లహరి కలిసి నిన్ను ఇలా ప్లాన్ చేసి పైకి పిలిపించారు.." నందు చెప్పింది వర్ష వైపు కోపంగా అలిగినట్టు మొహం పెట్టాను తను నవ్వుతు నీలి కలర్ తలంబ్రాలు ప్లేట్ చూపించింది చైనా వాడి సినిమా లాగ ఏమి అర్థం కాక తల అడ్డంగా ఊపాను … పెదాలు బిగించి తిక్కోడ అని ఫీలింగ్ ఇచ్చి తన నుదిటి మీద రెండు వేళ్ళతో కొట్టుకొని మళ్లీ అదే ప్లేట్ చూపిస్తుంది .. ఈసారి ఎవరో కొట్టగానే వెనకి తిరిగా బ్లూ డ్రెస్ కనపడింది అప్పుడు అర్థం అయింది … ఇంకో దెబ్బకి ఆరంజ్ కలర్ ప్లేట్ చూపించగానే చేయి వెనక్కి పోనిచ్చి గట్టిగా ఆ అమ్మాయి చేతిని గిచ్చేసాను … థాంక్స్ అని చెప్పాను తల అడ్డంగా సినిమా ఎఫెక్ట్ లో ఊపుతున్నా తను సిగ్గు పడుతూ నవ్వుతోంది …. తాళి కట్టే సమయం దగ్గర పడింది వర్ష తాళిని తీసుకెళ్ళి పెద్దల ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకొచ్చింది అభి లేచి తాళి చేతిలో తీసుకున్నాడు పంతులు ఆ బొండం పట్టుకొమ్మని ఇచ్చాడు కళ్ళు వర్ష వైపు చూపిస్తూ “ఏంటి నాయన లడ్డు కావాలా అయితే బొండం పట్టుకో” అని కౌంటర్ వేయగానే అందరు నవ్వుతున్నారు వర్ష ఒక జర్క్ తో నవ్వింది బొండంతో నెత్తికి కొట్టుకుందాం అనట్టుగా ఫీల్ ఇస్తుంటే “బాబు బొండం నాశనం చేయొద్దు కొట్టుకోవడానికి వేరేది ఇస్తాను అన్నాడు ఇందాక వేసిన కౌంటర్ కి బాగా రివెంజ్ తీర్చుకున్నాడు పంతులు … అభి తాళి అందరికి చూపిస్తూ … గట్టి మేళం మోగుతుండగా “ మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతున కంతే బధ్నామి శుభగె త్వం జీవ శరదమ్ శతం” ఒక్కో ముడి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఇక మీద ఇద్దరమూ ఒకటే అని నందు మేడలో కడుతున్నాడు … పూలు అక్షింతలతో అందరు సకల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఆనందంగా ఉండండి అని దీవిస్తున్నారు…. నందు కళ్ళలో ఆనంద బాష్పాలు అంకుల్ ఆంటీ అందరి కళ్ళు కూడా సంతోషంతో చెమ్మగిల్లాయి ….పీటల మీద నుండే అందరికి నమస్కరిస్తున్నారు ….

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com