ఇంక సెలవ్
- December 20, 2015
ఓ తండ్రీ ఓ తల్లీ మమ్ము క్షమించు!
విహార యాత్ర మాకు విజ్ఞ్యానమవుతుందని
తీసుకునే చిత్రాలు మా బ్రతుకు దొంతరల్లో తీపి
జ్ఞ్యాపకాలై మిగలాలని వెల్లామే కానీ ఇలా
ఆ నీటి ప్రవాహమే మీ కన్నీరై మిగులుతుందని
మేము ఊహించనేలేదు
మేధావులమై మీ మది ఆనందంతో వెలిగించాల్సిన
మేము అనుకోకుండానే ...
భగవత్ శక్తికి లొంగి మా రూపాన్ని కోల్పోయి ప్రకృతిలో
సేద దీరటానికి కనుమరుగయి పోయాం
వద్దు ఏడవకండేడవకండి నా ప్రియ మాత పితా గురువులారా
మళ్లీ వస్తాం ఎవరెస్ట్ ను అధిరోహించిన ఒక చెల్లి రూపులో
ఒక తమ్ముని ఆకారంలో యువ శక్తులమై ....
అచిరకాల మా ఆత్మ బంధువులైన మా ప్రియ మిత్రుల రూపంలో
మీ చుట్టూ తిరుగాడుతూనే ఉంటాం
మీ కడుపు తీపి చిరుగాలులమై మీ యెద తాకుతూనే
ఉంటాం... ఇంక సెలవ్
--జయ రెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







