వీర భోగ వసంత రాయలు లో శ్రీవిష్ణు ఫస్ట్ లుక్..!!
- October 21, 2018
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ' వీర భోగ వసంత రాయలు '.. ఈ చిత్రంలోని విష్ణు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ లుక్ విష్ణు షర్ట్ లేకుండా, బాడీ మొత్తం టాటూలతో కనిపిస్తున్నాడు.. సరికొత్త హెయిర్ స్టైల్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్న విష్ణు తెరపై తొలిసారి షర్ట్ లేకుండా కనిపిస్తూ అందరిని అలరించనున్నాడు.. ఇంద్రసేన ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి 'కల్ట్ ఈజ్ రైజింగ్' అనేది టాగ్ లైన్.. ఇప్పటికే సినిమా ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా ని బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై అప్పారావు బెల్లన నిర్మిస్తుండగా ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం ఎస్ వెంకట్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. వినూత్నమైన కథతో సరికొత్తగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 26 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది..
నటీనటులు : నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్ మరియు శ్రీ విష్ణు
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: ఇంద్రసేన.ఆర్
నిర్మాతలు: అప్పారావ్ బెల్లన
బ్యానర్: బాబా క్రియేషన్స్
సమర్పించువారు : డా.ఎమ్.వి.కే రెడ్డి
సంగీతం : మార్క్ కె రాబిన్
డిఓపి : ఎస్. వెంకట్,
ఎడిటర్: శశాంకర్ మాలి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి
PRO: వంశీ శేఖర్
తాజా వార్తలు
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







