షురూ కానున్న 'భారతీయుడు-2' షూటింగ్
- October 21, 2018
వెర్సటైల్ నటుడు కమల్ హసన్ పాలిటిక్స్ కి కాస్త గ్యాప్ ఇచ్చి , ముఖానికి మళ్ళీ రంగేసుకుంటున్నాడు. వెండి తెర మీద తిరిగి తన నట విరాట్ స్వరూపాన్ని చూపేందుకు రెడీ అవుతున్నాడు. 1996లో వచ్చిన తన 'భారతీయుడు' మూవీ రేపిన సంచలనానికి కొనసాగింపుగా..'భారతీయుడు-2' చిత్రాన్నితీయబోతున్నాడు. ఇందుకు ప్రత్యేకంగా అమెరికా నుంచి మేకప్ ఆర్టిస్టును రప్పించాడని, అప్పుడే మేకప్ సన్నాహాల్లో ఉన్నాడని కోలీవుడ్ కథనం.
భారతీయుడు చిత్రంలో అవినీతిపై ఉక్కుపాదం మోపిన సామాన్యుడిగా, ఆయన తండ్రిగా కమల్ హసన్ డబుల్ రోల్ పోషించాడు. తాజాగా మరి ఈ సీక్వెల్‌లో ఈ రెండో ' భారతీయుడు ' అలాంటి పాత్రే పోషిస్తాడా..నేటి రాజకీయ పరిస్థితులను, అవినీతిని ఇందులో ఎండగడతాడా అన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతోంది. శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నయనతార కీలకపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







