తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
- January 29, 2019
తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఉన్న బీసీ గురుకులాల్లో 4 వేల 322 పోస్టులు మంజూరు చేసింది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభించే 119 బీసీ గురుకులాల్లో విడతల వారీగా వీటిని భర్తీ చేస్తారు. మహాత్మా జ్యోతిబా పులే బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కార్యాలయంలో 3,717 రెగ్యులర్, 605 ఔట్ సోర్సింగ్ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 119 బీసీ గురుకులాల ఏర్పాటుకు 2018 ఆగస్టులోనే అనుమతిచ్చింది. బీసీ సంక్షేమ శాఖ వీటికి అవసరమైన పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే సరికి శాసన సభ ఎన్నికల నియామావళి అడ్డొచ్చింది.
తాజా ఉత్తర్వుల్లో 2019- 20 ఏడాదికి పీజీటీ, పీడీ, జేఎల్ పోస్టులు మినహా మిగతా 2,537 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి సర్వీస్ నిబంధనలు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశముంది. 2020- 21 విద్యా సంవత్సరానికి గురుకులాల్లో 833 పీజీటీ పోస్టులు మంజూరయ్యాయి. 2021- 22 సంవత్సరానికి 119 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను కేటాయించింది. 2022 23 నాటికి పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ అవుతాయి. అప్పుడు 833 జూనియర్ లెక్చరర్ పోస్టులుంటాయి. ప్రభుత్వం ఉత్తర్వుల్లో వీటిని కూడా చేర్చింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







