మతపరమైన పుస్తకాల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్
- February 28, 2019
బహ్రెయిన్: ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తులు మతపరమైన పుస్తకాల మాటున మరిజువానా డ్రగ్స్‌ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించగా, వారిని అరెస్ట్ చేశారు. నిందితులు ఢాకా నుంచి వచ్చినవారిగా గుర్తించారు అధికారులు. కస్టమ్స్ అధికారి, నిందితులపై అనుమానంతో తనిఖీలు నిర్వహించగా, వారి నుంచి మరిజువానాను స్వాధీనం చేసుకోగలిగారు. ఎవరికీ అనుమానం రాకుండా వుండేందుకు నిందితులు మతపరమైన పుస్తకాల్ని వాడుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అయితే విచారణ సందర్బంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. కాగా, నిందితులకి న్యాయస్థానం పదిహేనేళ్ళ జైలు శిక్షతోపాటుగా 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. శిక్షా కాలం పూర్తయ్యాక నిందితుల్ని డిపోర్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







