ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసిన పవన్‌కళ్యాణ్
- March 14, 2019
జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది… 32మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు పవన్‌కళ్యాణ్… అలాగే నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను కూడా ఖరారు చేశారు… ఇవాళ రాజమండ్రిలో ఆవిర్భావ సభ నిర్వహిస్తుండగా తొలి జాబితా విడుదల చేయడం గమనార్హం… మరోవైపు జనసేన, వామపక్షాల మధ్య పొత్తు చర్చలు ఈ నెల 16న కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి…
ఏపీలో అభ్యర్థుల జాబితా విడుదలలో మొదట నిలిచింది జనసేన పార్టీ… మొత్తం 32 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం అర్థరాత్రి దాటాక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు… అసెంబ్లీ అభ్యర్థులతోపాటు నలుగురు పార్లమెంట్ సభ్యులను కూడా ఖరారు చేశారు…..
ముందే ప్రకటించినట్టుగా రాజమండ్రి నుంచి ఆకుల సత్య నారాయణ, అమలాపురం నుంచి డీఎంఆర్ శేఖర్ ఎంపీగా పోటీ చేయనున్నారు. విశాఖ నుంచి గేదెల శ్రీనుబాబు, అనకాపల్లి నుంచి చింతల పార్ధసారథి ఎంపీలుగా పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఇక ఎమ్మెల్యేల జాబితా విషయానికి వస్తే.. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్ నుంచి తోట చంద్రశేఖర్, మమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణల పేర్లను పవన్ ఇంతకు ముందే ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..