న్యూజిలాండ్‌లో కాల్పల కలకలం
- March 15, 2019
న్యూజిలాండ్‌లో కాల్పలు కలకలం సృష్టించాయి. క్రైస్ట్‌చర్చ్ నగరంలోని ఓ మసీదులో ఓ ఆగంతుకుడు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. నల్లరంగు బట్టలు వేసుకున్న ఓ వ్యక్తి అల్ నూర్ మసీదు లోపలకు వచ్చి కాల్పులు జరిపినట్టు స్థానికులు చెపుతున్నారు..
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. నగరంలోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడితో భయభ్రాంతులకు లోనైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మసీదులో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ దాడి నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. టెస్ట్ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో మూడో టెస్టు ఆడనున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు దాడి సమయంలో ఆ ప్రాంతంలోనే ఉన్నారు. బంగ్లా క్రికెటర్లు అక్కడ నుంచి బయటపడ్డ సయంలోనే ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







