ఒమన్ బోట్ ట్రాడెడీ: చివరి మృతదేహం లభ్యం
- March 15, 2019
మస్కట్: హృదయ విదారకమైన బోట్ యాక్సిడెంట్‌కి సంబంధించి చివరి మృతదేహాన్ని ఎట్టకేలకు అధికారులు కనుగొన్నారు. రాయల్ ఒమ్ పోలీస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. విలాయత్ ఆఫ్ మహౌత్ షోర్‌లైన్‌లో ఈ మృతదేహాన్ని కనుగొన్నారు. మార్చి 8న ఆరుగురు ఒమనీ పౌరులు, వలాయత్ ఆఫ్ మహౌత్ మీదుగా ఫిషింగ్ ట్రిప్‌కి వెళ్ళారు. ఈ క్రమంలో బోటు మునిగిపోయింది. స్థానికంగా వున్నవారు ఈ ప్రమాదాన్ని గుర్తించి, ఇద్దర్ని రక్షించగలిగారు. అయితే మరో ఇద్దర్ని మాత్రం కాపాడలేకపోయారు, వారి మృతదేహాల్ని బయటకు తీసుకొచ్చారు. మరో ఇద్దరు గల్లంతు కాగా, అందులో ఒకరి మృతదేహం బుధవారం దొరికింది. ఇప్పుడు మరో మృతదేహం దొరికిందని, ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







