రోబో-2 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి
- May 13, 2015
ప్రముఖ నటుడు రజనీకాంత్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'రోబో' సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రూపొందించే సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ 'అట్టకత్తి, మద్రాస్' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కేవలం మూడు నెలల్లో పూర్తిచేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా తరువాత రజనీ రోబో-2లో నటిస్తాడు. ఈ సినిమాకోసం మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న రైటర్ను దర్శకుడు శంకర్ రంగంలోకి దింపారు. తమిళ, మలయాళ భాషల్లో రచయితగా బాగా పాపులరైన జయమోహన్ రోబో-2 కథను సిద్ధం చేయనున్నారు. జయమోహన్ ఇప్పటికే పలు సంచలన చిత్రాలకు రచయితగా పనిచేశారు. దీంతో ఇప్పుడు రోబో-2పై కోలీవుడ్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్లో మరో ప్రముఖ నటుడు విక్రమ్ నటిస్తాడని సమాచారం.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







