'అదుర్స్ 2' హీరోయిన్లు అదుర్స్...
- May 12, 2015
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నయనతార, షీల హీరోయిన్స్‌గా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అదుర్స్'. ఎన్టీఆర్‌లోని కామెడీ యాంగిల్‌ను 'అదుర్స్' చిత్రం ద్వారా వి.వి.వినాయక్ బయటకు తీసుకు వచ్చారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాలకు మాత్రమే పరిమితమయిన ఎన్టీఆర్ 'అదుర్స్'తో తాను కూడా కామెడీ చేయగలనంటూ నిరూపించుకున్నాడు. ఆ చిత్రం విజయంతో దానికి సీక్వెల్ తీసుకు రావాలని ఎన్టీఆర్, వినాయక్‌లు చాలా కాలంగా భావిస్తున్నారు. దీనికోసం ప్రముఖ రచయితలు కోనవెంకట్, గోపీమోహన్‌లు అద్బుమైన స్క్రిప్ట్‌ను తయారు చేశారట. ఎన్టీఆర్ 'అదుర్స్-2'ని చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడని సమాచారం. అయితే అఖిల్ సినిమాతో వినాయక్ బిజీగా ఉండగా...ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. వీరి ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తవగానే 'అదుర్స్-2' పట్టాలెక్కనుంది. 'అదుర్స్2' చిత్రంలో యంగ్‌టైగర్ సరసన అందాల తార నయనతారతో పాటు అందాల ముద్దుగుమ్మ ఆండ్రియాలు నటించనున్నారని ఫిలింనగర్ సమాచారం. అదుర్స్ చిత్రంలో ఎన్టీఆర్, నయనతార జంట అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సీక్వెల్‌లో నయనతో పాటు ఆండ్రియా జతయ్యింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







