మోహన్‌బాబు హౌస్ అరెస్ట్
- March 22, 2019
సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ సంస్థల ఛైర్మన్ మోహన్‌బాబు నివాసం వద్ద ఉదయం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన తిరుపతిలో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో.. ఆయన బయటకు రాకుండా నిలువరించిన పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో.. పోలీసులకు , మోహన్‌బాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను ఆందోళన చేసి తీరతానని మోహన్‌బాబు పట్టుదలగా ఉన్నారు. ఈనేపథ్యంలో.. శ్రీవిద్యా నికేతన్ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







