ప్రాణాలకు భరోసా అంటూ లేదు ప్రభుత్వానికి మా గురించి పట్టింపు లేదు

- March 22, 2019 , by Maagulf
ప్రాణాలకు భరోసా అంటూ లేదు ప్రభుత్వానికి మా గురించి పట్టింపు లేదు

ఆకలివేదన వలసపొమ్మన్నోళ్ళం-
రా(ష్టాలు దాటివచ్చి కడుపునింపుకుంటున్నోళ్ళం-
ఏడారుల్లో చిక్కుకొని బతుకులు అర్పిస్తున్నాం-
ఏవ్వరికీ పట్టనోళ్ళం-
కష్టాన్నీ నమ్మే వలస జీవులం 
వయస్సును దారపోసే  చేదునిజాలం-
అంబారాన్ని అంటే కట్టడాల మద్య జీవితాలు-

రాలిపోతున్న ఆశలు-
ఇరుకు గదుల జీవనం-
మా పిల్లలకు ప్రేమలు పంచలేని  దుర్బలులం-
ఏమని చెప్పాలి మా వేదన-
ఎవ్వరికీ అర్దంకాని కన్నీటి రోదన-
నెల మొత్తం చేస్తే వచ్చేది తొమ్మిది వందలే-బతుకుతెల్లారాలంటే సాగిపోవాలి ఇలాగే-
తలరాత మారనోళ్ళం-
రేపటి ఉషోదయం కోసం ఏదురుచూస్తున్నోళ్ళం** * * *

ప్రాణాలకు భరోసా అంటూ లేదు
ప్రభుత్వానికి మా గురించి పటింపు లేదు
నాంకెవస్తు వాగ్దానం నవ్వుతూనే కట్టిపడేసే నాయకులు
బ్రతకపోయినోనికి ఎందుకు భరోసా

పాలసీలు.....అంటే 
ఉత్తి ఉత్తవే అనే సంగతి తెలియదు
సంసారాన్ని సముద్రలు దాటి మొసేటోళ్లకు

NRI అన్నలు 
"చూస్తూనే ఉండండి-
గోడమీద రాసుకొని రేపు అన్న పదాన్ని-
ఏదురుతిరిగి పోరాడనంతకాలం;

మీ పిల్లలకు మీ చేతుకు వచ్చేంత ఆగండి ;
వాళ్ళను కూడా ఇక్కడనే బానిసలు చేయండి

మా బండగుండెలు బద్దలయ్యేంత వరకు;
జిరాక్స్ తల రాతనుకొని 
గోడమీద రేపుని చూస్తూనే ఉండండి-
అత్యాశతో....
ఇట్లు
ఆకుల రామచంద్ర (దుబాయ్)
రాచర్ల గొల్లపల్లి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com