బాటాకు చేదు అనుభవం
- April 15, 2019
చండీగఢ్:నిజానికి దినేష్ ప్రసాద్ గారిలా రోజువారీ కొనుగోళ్లలో ఎంతో నష్టపోతుంటాడు వినియోగ దారుడు. అన్యాయంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నించే టైము, వాగ్యుద్ధానికి దిగే ఓపిక ఎవరికీ ఉండట్లేదు. పంజాబ్ చండీగఢ్‌కి చెందిన దినేష్ బాటా షోరూంకి వెళ్లి బూట్లు కొనుగోలు చేశారు. వాటి రేటు రూ.402లు, షూస్‌ని పేపర్ బ్యాగ్‌లో పెట్టిస్తూ దాని బ్యాగ్ రేటు రూ.3లు అని బిల్లులో వేశారు.
దానికి ఆగ్రహం చెందిన దినేష్ మీ షోరూం ప్రమోషన్ కోసం బాటా లోగో వేసిన ఉన్న బ్యాగ్ ఇస్తూ.. పైపెచ్చు దానికి మా దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అని యాజమాన్యం మీద రివర్సయ్యాడు. ఆ 3రూ.లు నేనివ్వను. ఫ్రీగా ఇవ్వండి బ్యాగ్ అని అడిగాడు. దానికి యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో దీనేష్ వెళ్లి వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేశాడు. దినేష్ వాదనను విన్న ఫోరం.. బాటాకు జరిమానా విధించింది.
పేపర్ బ్యాగ్‌కి బలవంతంగా రూ.3లు వసూలు చేయడం సేవలలో లోపమేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. కస్టమర్లు ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు పేపర్ బ్యాగ్ ఉచితంగా ఇవ్వాలని పేర్కొంది. వ్యాజ్యంకు రూ.1000, మానసిక ఆందోళనకు రూ.3000, లీగల్ ఎయిడ్ నిధికి రూ.5,000లు, కంప్లైంట్ చేయడానికి అయిన ఖర్చు రూ.1000లు చెల్లించమంటూ బాటాని ఆదేశించింది.
ప్రతి వినియోగదారుడికి ఉచితంగా క్యారీ బ్యాగ్ అందజేయాలని ఆదేశించింది. చాలా స్టోర్లలో క్యారీ బ్యాగ్ పేరుతో రూ.3 నుంచి రూ.5లు వసూలు చేస్తుంటారు. అడిగేవారు లేకపోవడంతో అడ్డంగా దోచేస్తున్నారు. దినేష్ ప్రసాద్ లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతైనా అవసరం.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







