మదిని మీటిన వర్షం-పార్ట్-10
- December 31, 2015
అభి గాడికి సూట్ వేసి నేను రెడీ అయి మండపంకి వెళ్ళాను మొత్తం మండపం హంగు మార్చేసారు.. వేదిక మీద బంగారు దీపాల కాంతులు, మొత్తం స్టేజి రంగు రంగు పూల అలంకరణ, స్టేజి చుట్టూ అంత రంగు రంగు బెలూన్ లతో అలంకరణ మధ్యలో పూలతో లవ్ సింబల్ దాంట్లో అభి,నందు పేర్లు … స్టేజి ఇరువైపులా విచ్చుకున్నా నెమలి ఆకారంలో సుగంధ పరిమళ వెదజల్లే జలపాతాలు… మండపం మధ్య చంద్రవంకను పోలి ఉన్న రాజ సింహాసనం వేసారు . మండపం అంత అభి నందు ఫొటోస్ పెట్టారు …. పెళ్లి తంతు అందరికి కనపడేలా స్క్రీన్స్ పెట్టారు ... ఆర్కెస్ట్రా వాళ్ళు తమ పాటలతో మాటలతో జనాల్ని అలరిస్తున్నారు … నేను వర్ష కోసం వెతుకుతూ ఉన్నా, మెట్ల పైన నుంచి వర్ష దిగుతోంది పింక్ కలర్ చీరలో ఎంత అందంగా ఉంది అంటే వర్ణించడానికి చూస్తున్న ఈ కళ్ళకు మాటలు రావడం లేదు వర్ణించే పెదాలు తన అందాన్ని చూడలేదు.. నా దిష్టి తగిలేలాగా ఉంది .. తను దగ్గర రాగానే నా రెండు చేతులని తన వైపు చూపించి చేతి వెళ్ళు విరిచి దిష్టి తీసాను … సిగ్గు పడుతూ వెళ్లిపోయింది నేను చూస్తూ ఉండి పోయాను …. ఇంతలో అనిల్ గాడు కర్చీఫ్ ఇచ్చి “రేయ్ చూసింది చాలు ఇదిగో తుడుచుకో పద కేకు కట్ చేయించాలి"…. స్టేజి మధ్యలో పూలతో అలంకరించి ఒక దీపం పెట్టించాను, కేకు కటింగ్ రెడీ చేసాను … అభి నందు స్టేజి పైకి రాగానే జ్యోతి ప్రజ్వలన చేపించాము దీపాలు వెలిగించెటప్పుడు పైన కట్టిన బెలూన్ పగలగోట్టాము దాని నుంచి పూల వర్షం దంపతుల మీద కురిసింది… దండలు చేతికి ఇచ్చి నందు దండ వేయబోతుంటే అభి గాడిని పైకి ఎత్తాము …. వర్ష ఏదో చెవిలో ఊదింది అంతే అమ్మాయిలు ఏమి రియాక్షన్ లేకుండా స్టైల్ కొడుతూ చూస్తున్నారు మాకు మోసే ఓపిక లేక కిందకి దించగానె నందు వచ్చి హారం వేసింది ఎంత తెలివి మీరి పోయారు ఈ ఆడోల్లు… ఈసారి అభి గాడు వేస్తుంటే నందుని చైర్లో కూర్చోపెట్టి అలా పైకి లేపెసారు … మేము అదే ప్లాన్ అప్లై చేద్దాం అంటే నందు నాజుకుగా ఉంది వీళ్ళు ఎంత సేపు అయిన మోసేలాగా ఉన్నారు వీన్ని ఎత్తుదాం అంటే క్రేన్ అయితే సరే కానీ మనం కష్టం అనుకున్నాం ఆల్రెడీ కొండను మోసిన వాళ్ళ లాగ అలిసిపోయారు మా వాళ్ళు … అమ్మాయిలు ఎక్కిరిస్తున్నారు పరువు పోతోంది … “బావ నిన్ను ఎత్తాలి అంటే అందరికి తీర్థం కావాలి సాయంత్రానికి పార్టీ ఇస్తాను అంటే చెప్పు కష్టపడి ఎత్తుకుంటాము …” సరే అని తల ఊపాడు.. కష్టపడి అటు ఇటు ఊగుతూ ఎలాగో పైకి లేపి దండ వేయించాము, ఒక్కసారిగా వాణ్ణి వదిలేసి నడుములు పట్టుకుని నిల్చున్నాము… అమ్మాయిలు ఎకిరిస్తూ నవ్వుతున్నారు .. కేకు కట్ చేసేటప్పుడు ఫుల్ అరుస్తూ ఫోమ్ పార్టీ క్రాకెర్స్ అన్ని బాగా పెల్చాము … N అక్షరం ఉన్న కేకు పీస్ కట్ చేసి నందుకి ఇచ్చి తినిపించామన్నా వీడు నోరు గట్టిగా మూసుకొని ఉన్నాడు తినను అని మారం చేస్తూ … మళ్లీ ఏదో గుస గుస ఈ కొప్పులు కలిసి మా వాడి పప్పులు దంచడానికి ఏదో ప్లాన్ వేస్తున్నారు ఏం జరిగిన ఈ సారి ఏం చేసిన లొంగొద్దు అని చెప్పాము … అమ్మాయిలంతా నందుని కవర్ చేసారు నందు కన్ను కొట్టి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది అంతే సోల్లుగాడు నోరు తెరిచేసాడు నోటి నిండా కేకు కుక్కేసింది… “తు ఎదవ పరువు తీస్తున్నావు కదా అమ్మాయిల ముందు”… ఇప్పుడు అభి గాడికి A అక్షరం ఉన్న కేకు తీసుకుంటే వెళ్ళు నందు నెత్తి మీద ముసుగు వేయించారు టచ్ చేయకుండా తినిపించాలి అని కండిషన్ .. పక్కన బామ్మర్దిని పట్టుకొని అభి పాడుతునట్టుగా పాట పాడాను “ఏందిరా ఓరి బామ్మరిది తిక్కలదిరా నీ అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క” అని పాడిన వెంటనే ముసుగు తీసింది కోపంతో తిక్కది అన్నందుకు సారీ అని మోకాలి మీద కుర్చుని ఫ్లవర్ బోకే ఇచ్చాడు నవ్వుతు తీసుకునేటప్పుడు లేచి నవ్వుతున్న నోట్లో కేకు మొత్తం పెట్టేసాడు“ గెలిచాము అని గట్టిగా అరిచాము.. ఇప్పుడు ఇద్దరినీ కూర్చో పెట్టి ఒక చెర్రీ తీసుకొని మధ్యలో చిన్న పుల్ల గుచ్చి ఇద్దరి మధ్యలో పెట్టాను అటు నుంచి అభి ఇటు నుంచి నందు తినాలి ఇద్దరు సిగ్గు పడుతున్నారు “నందు అభి ఆలసించిన ఆశ భంగం కానివ్వండి తొరగా” అన్న ఎంతకి తినకపోయే సరికి అందరిని కవర్ చేయమని చెప్పాను కవర్ చేయగానే టక్కుమని తినేశారు “రేయ్ రాత్రి వరకు ఉంచుకోరా ఈ ఆవేశం అంత ఆత్రం పనికి రాదూ” అనగానే అందరు నవ్వుతు కిందకి దిగేశారు నేను అభిని వర్ష నందుని మళ్లీ రెడీ చేసాము ఫోటో సెషన్ కోసం ….. అభి చేత నందు కుంకుమ పెట్టించారు .. “రేయ్ బావ నీ చెల్లి చూడు ఎంత అందంగా బంగారు బొమ్మ లాగ ఉంది కాని ఒకటే తక్కువ అయింది కుంకుమ పెట్టుకుంటే మహలక్ష్మి లాగ ఉంటుంది” అని నేను అనుకునే లోపల తను కుంకుమ పెట్టుకుని నా వైపు తిరిగింది.. "ఏరా పెట్టుకో అని చెప్పినట్టు నువ్వు ఇలా అనుకోగానే అక్కడ తను పెట్టుకుంది ఏంటి కథ" తనని చూసి సూపర్ అంటూ చేయి చూపించి దిష్టి తీసి ఎద పైన చేయి పెట్టుకొని చూస్తున్నా” సిగ్గు పడుతూ నందు పక్కన నిల్చుంది.. అభి గాడు పిలిచి తోడుగా ఉండమన్నాడు … ఇద్దరం వెనక నిల్చున్నాం కళ్ళు చాల మాట్లాడుతున్నాయి పెదాలు పెగలడం లేదు … జనాలు వస్తున్నారు ఫోటో దిగుతున్నారు గిఫ్ట్ లు ఇస్తే నేను వర్ష తీసుకుంటున్నాం “రేయ్ బావ ఈ గిఫ్ట్ లు మాకెందుకు రా నీ జేబుల్లో పెట్టుకున్న ఆ మనీ కవర్లు చేతికి ఉన్న ఉంగరాలు ఇస్తే నీ ఫోటో మా పూజ గదిలో పెట్టుకొని దండేసి దండం పెడతా” వాడు వెనక్కి తిరిగి సీరియస్ గా చూసాడు "సరేలే ఈ మూడు రాత్రులు అయ్యాక పెడతా లే ” ఇలా కుళ్ళు జోకులు వేసే కొద్ది వర్ష నందు నవ్వుతూనే ఉన్నారు … ఆర్కెస్ట్రా వాళ్ళు పెళ్లి వాళ్ళలో ఎవరినా పాట పాడండి అని పిలిచారు ఆడ గ్యాంగ్ మొత్తం వర్ష అని అరిచి తనని అడుగుతున్నారు పాడమని తను నో చెబుతూ నా సైడ్ చూసింది... పాడొచ్చు కదా అని రిక్వెస్ట్ చేశా మారు మాట్లాకుండా స్టేజి పైకి వెళ్లి నన్ను చూస్తూ “అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా” అని పాట పాడింది వహ్ అయిపోయాక అందరు చప్పట్లు కొడితే నేను మాత్రం విజిల్ కొట్టా నేల క్లాసు టికెట్ గాడిని కదా ఎక్కడికి పోతాయి అవి.… సిగ్గు పడుతూ ఉంది సూపర్ అని చూపించా మళ్లీ దిష్టి తీసా … “పెళ్లి కూతురు తరపున వర్ష గారు పాడి మెప్పించారు మరి అబ్బాయి తరపున” అనగానే మా గ్యాంగ్ మొత్తం నా సైడ్ తిరిగి చూసారు ... ఏదో బాత్రూం సింగర్ ని వీళ్ళు నన్ను అడగకుండా తీసుకెళ్ళి స్టేజి పైన నిలపెట్టేసారు మా వాళ్ళు ఏం పాడాలో గొంతు సవరించుకుంటూ ఉంటె బండది హాల్స్ కావాలా నాయన అని అడిగింది … ఇంకా తెగించేసి వర్షని తలచుకొని నాకిష్టమిన పాట “ప్రతి దినం నీ దర్శనం మరి దొరకున.. అనుదినం నీ అర్చనం ఇక జరపన ” అని స్టార్ట్ చేశా ఆఫ్ కోర్స్ వర్ష కంటే బ్రహ్మాండంగా పాడాను.. ఈ లైన్ పాడిన ప్రతిసారి తను సరే అని తల ఊపుతోంది .. ఫుల్ కేకలు మా వాళ్ళు అందరు చప్పట్లు ఏంటో మా లారక్క చప్పట్లు కొట్టేసి సూపర్ అని చెప్పి దిష్టి కూడా తీసేసింది…ఇంతలో ఒక పెద్ద చెంబులో స్ట్రా వేసి మ్యాంగో జ్యూస్ పట్టుకొని వచ్చారు మా వాళ్ళు … ఇద్దరు తాగారు నందుకి జ్యూస్ రాలేదు అని చెప్తోంది అభి వస్తోంది బాగుంది అని అంటున్నాడు … మళ్లీ ట్రై చేసింది రాలేదు ... స్ట్రా చేంజ్ చేసి తాగారు ఎంత తాగిన రావడం లేదు నందుకి అభి గాడు సూపర్ జ్యూస్ రా అంటున్నాడు … లారక్క కోపడితే నువ్వు తాగి చూడు అని చెంబు చేతిలో పెట్టింది లారక్క పీల్చింది రావడం లేదు … అభి మాత్రం జ్యూస్ సూపర్ అంటున్నాడు … ఇంతలో వర్ష ట్రై చేసింది రావడం లేదు ఇసారి తొరగా అభి గాడి స్ట్రా లాక్కుని తాగి సూపర్ జ్యూస్ అని అన్న … అందరు యుద్ధానికి వచ్చారు ఏంటిది మాకు రావడం లేదు మీకు ఎలా వస్తుంది అని స్ట్రా తీసి చూపించాం ఒక దానికి ఒకటి ముడి వేసి పెట్టాము ఈ మాట అభి గాడికి ఆల్రెడీ చెప్పి పెట్టాము వాడు నటించాడు నేను జీవించాను … వేరే స్ట్రాలు తెప్పించి జ్యూస్ తాగించాము… అందరం కలిసి ఫోటోలు దిగాము ప్రతి ఫోటోలో అభి పక్కన నేను నందు పక్కన వర్ష … భోజనాలు తినేకి వెళ్ళాము అభి నందుకి నాకు సెపరేట్ చైర్స్ వేసారు, సీట్ పైన కూర్చోగానే ఏదో విరిగుతున్న సౌండ్ కుర్చీ ఏమో అని భయపడి లేచి చూస్తే కుర్చీ బాగానే ఉంది కుర్చికి ఉన్న బట్ట తీసి చూస్తే అప్పడాలు పెట్టారు … ఇంతలో ఈ ఆడ గ్యాంగ్ మాకు వడ్డించడం మొదలు పెట్టారు మీరు తినండి అంటే ముందు అతిథులు మగ పెళ్లి వారు మీరు తిన్నాక చివర్లో మేము అని డైలాగులు.. వర్ష స్వీట్ పెట్టింది బండది నీళ్ళు పోసింది అందరికి వార్నింగ్ ఇచ్చాను "రీ వాటర్ లో ఉప్పు ఉంటుంది జాగ్రత్త" “బాగానే కనిపెట్టావు రా నీ కిడ్నీ కూడా బాగానే పని చేస్తోంది ” కొన్ని తాగి చూసా వాటర్ బాగానే ఉన్నాయి వీళ్ళ మొహాలు తేడాగా ఉన్నాయి ఏమో అని తినడం స్టార్ట్ చేసి అభి నందు తప్ప అందరం స్వీట్ ఒకే సరి నోట్లో పెట్టుకున్నాం విపపరీతమైన కారం ఉప్పు అందరు ఉమ్మేసాము గ్యాంగ్ మొత్తం ఫూల్ అయ్యాము … సారీ చెప్పి వేరే స్వీట్స్ వడ్డించి వాళ్ళు మాతో జాయిన్ అయ్యారు … కుళ్ళు జోకులు వేస్తూ నవ్విస్తూ భోజనం ముగించి మండపం లోకి వచ్చాము అందరు ఇంకా బయల్దేరడానికి సిద్దం అయ్యారు ఇంకా కొద్ది సేపటిలో వర్ష కూడా వెళ్ళిపోతుంది కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు నేను ఏమైనా చేసి మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగానే బ్యాగ్ తో వర్ష ఎదురయ్యింది తన దగ్గరికి వెళ్తుంటే అనిల్ పిలిచి అభి అర్జెంటుగా రమ్మంటున్నాడు … వర్ష వెళ్ళిపోతోంది అని బాధ పడుతూ అభి దగ్గరికి వెళ్ళాను..
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









