తీయని సరస్సు
- December 31, 2015
సిగ్గుల మొగ్గై మనసు దోచి
పరిమలించిన పూదోటవై నీ
హృదయ మందిరంలో చోటిస్తావు
మన ప్రేమ వనంలో మొలకెత్తిన
మమతల పసిడి మొలకలను
నీ కంటి పాపలుగా మార్చుకుని
ఆశల సౌధాలేవో నిర్మించ నేను
కనుమరుగైనపుడు
గాలి వానలకు చలించని చిత్తరువు నీవై
వీడని భంధమై..ఎల్ల వేళల ఎదురు చూస్తావు
అసంధర్భ ప్రగల్భాలతో, అసంపూర్ణ కార్యాలతో
నేను తప్పటడుగులు వేసి
వేల వేల తప్పిదాలతో దోషీని నేనై
ప్రాయాశ్చిత్తంతో శరణార్తుడైనపుడు
నీ చల్లని హిమ కరములతో స్ప్రషించి
ఆప్యాయంగా తల నిమిరి యెదలో
దాచుకునే
తేనెలొలుకు తీయని సరస్సు నీవవుతావు.
--జయ రెడ్డి బోడ(అబుధాబి )
తాజా వార్తలు
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!







