ETCA మరియు తెలంగాణ జాగృతి యూఏఈ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్

- May 11, 2019 , by Maagulf
ETCA మరియు తెలంగాణ జాగృతి యూఏఈ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్

దుబాయ్:ETCA మరియు తెలంగాణ జాగృతి యూఏఈ ఆధ్వర్యంలో ఇమాజిన్ ఈవెంట్స్ సహకారంతో లీగల్ కన్సల్టెంట్ శాలెం బాబు చే లీగల్ అవేర్నెస్ కార్యక్రమము మరియు పవిత్ర రమదాన్  30 రోజుల ఉపవాస దీక్షలో భాగమైన 5 వ రోజు ETCA అధ్యక్ష్యులు రాధారపు సత్యం మన ముస్లిం సోదరులకు, శ్రేయోభిలాషులకు ఇఫ్తార్ విందును ఇవ్వడం జరిగింది.

లీగల్ కన్సల్టెంట్ శాలెం బాబు ఇచ్చినటువంటి అమూల్యమైన న్యాయ సలహాలను, సమాచారాన్ని ముఖ్యంగా మంచి పని కోసం వారు వెచ్చించిన  విలువైన సమయాన్ని అభినందిస్తూ సభ్యులు, హాజరయిన వారు వారికి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.  

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరు అయిన ETCA  ప్రెసిడెంట్ సత్యం  ముందుగా రమదాన్ కరీం శుభాకంక్షలు తెలియచేసారు, భవిష్యత్ కాలంలో సంఘాన్ని మరింత పటిష్టపరుస్తూ ఇమాజిన్ ఈవెంట్స్ సహకారంతో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్మికులకు మన వారికి ఉపయోగపడేలా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తునట్టు తెలిపారు , ఏప్రిల్ 19 వ తేదీన గుండెపోటు తో మరణించిన నిర్మల్ జిల్లా, లక్ష్మణచాంద మండలము, కన్కపూర్ గ్రామానికి చెందిన నాగన్న మృతదేహాన్ని స్వదేశానికి పంపడానికి పనిచేసిన, కో-ఆర్డినేట్ చేసిన సభ్యులు రాజ శేఖర్ తోట, నరేష్ కుమార్ మాన్యం, అరవింద్ బాబు, భరత్ లను అభినందించారు.

రమదాన్ మాసం ప్రారంభం అయిన నుండి ఇఫ్తార్ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన అరవింద్ బాబు,అరవింద్ బొడ్ల,ఇమాజిన్ ఈవెంట్స్ నిర్వాహకులను సభ్యులు అభినందించారు.

కార్యక్రమానికి హాజరు అయిన మా గల్ఫ్ నిర్వాహకులు,TV5 చీఫ్ కోఆర్డినేటర్  శ్రీకాంత్ చిత్తరువు ETCA చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు, అందరికి రమదాన్ మాస శుభాకంక్షలు తెలియచేసారు.కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యూఏఈ శాఖ అధ్యక్షుడు సాయి చందర్ కటకం పాటు పలువురు ETCA,జాగృతి సభ్యులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com