దుబాయ్ లో వైఎస్సార్‌సీపీ విజయోత్సవాలు

దుబాయ్ లో వైఎస్సార్‌సీపీ విజయోత్సవాలు

దుబాయ్:ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దుబాయ్ లోని సోనాపూర్ బ్లూ డైమండ్ వర్కర్స్ క్యాంపు లో సంబరాలు నిర్వహించారు.యూ.ఏ.ఈ లో ఉన్న వైకాపా కార్యకర్తలు, అభిమానులు మిఠాయిలు పంచుతూ.. నృత్యాలు చేస్తూ..సంబరాల్లో పాల్గొన్నారు.ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ స్థానాలు రావడంతో పార్టీ కేడర్ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు.వైఎస్సార్‌సీపీ యూ.ఏ.ఈ NRI సెల్ తరపున రమేష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి మరియు పార్టీ MLA,MP లకు శుభాకాంక్షలు తెలిపారు.రమేష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సక్సెస్ మరియు చంద్రబాబు నాయుడు  ఫెయిల్యూర్ గురించి వివరించారు.

పవిత్ర రమదాన్ సంధర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి,సోమిరెడ్డి,కుమార్ చంద్ర,అక్రమ్,బ్రహ్మానంద రెడ్డి,రెడ్డయ్య,సుధాకర్ రావు,రమణ,దిలీప్,కోటేశ్వర్ రెడ్డి,జగదీశ్,హరీష్ ప్రభాకర్,నసీర్,శివానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top