యూఏఈలో వెదర్ వార్నింగ్ జారీ
- June 20, 2019
యూఏఈ: నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ, రోడ్లపై డస్ట్ ఎక్కువగా బ్లో అయ్యే అవకాశం వుందంటూ పాదచారులకూ, వాహనాలు నడిపేవారికీ హెచ్చరికలు జారీ చేసింది. విజిబిలిటీ చాలా తక్కువగా వుంటుందనీ, ఇది 1,500 మీటర్ల కంటే తక్కువకు పడిపోతుందని, గాలుల వేగం గంటకు 45 కిలోమీటర్లుగా నమోదవుతుందనీ, ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్‌లో ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై వుండొచ్చు. ఉష్ణోగ్రతలు అంతర్గత ప్రాంతాల్లో 39 నుంచి 44 డిగ్రీల వరకు చేరుకుంటాయి. కోస్టల్ ఏరియాస్‌లో 35 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతుల వుండొచ్చు. మౌంటెయిన్స్‌లో 28 నుంచి 35 వరకు ఉష్ణోగ్రతలు వుంటాయని ఎన్‌సిఎం పేర్కొంది. హ్యుమిడిటీ అత్యధికంగా 60 నుంచి 80 శాతం వరకు కోస్టల్ ఏరియాస్‌లోనూ, 65 నుంచి 85 శాతం వరకు ఇంటీరియర్ రీజియన్స్‌లో, 50 నుంచి 70 శాతం వరకు మౌంటెయిన్స్‌లో వుండొచ్చు. కొన్ని చోట్ల గాలుల వేగం గంటకు 50 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశముంది. సముద్రం రఫ్ నుంచి వెరీ రఫ్‌గా మారొచ్చు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..