హీరో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం...
- June 23, 2019
శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత చాల గ్యాప్ తీసుకున్న నితిన్..తాజాగా భీష్మ చిత్రాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుములు డైరెక్షన్లో రష్మిక హీరోయిన్ ఈ మూవీ రూపుదిద్దుకోబోతుంది. ఈ చిత్రం సెట్స్ పైకి ఇంకా వెళ్లకముందే మరో సినిమాకు కొబ్బరి కాయ కొట్టారు.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తన 28 వ చిత్రాన్ని నితిన్ మొదలు పెట్టాడు. హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటించనున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నితిన్ ట్విట్టర్ లో చిత్ర విశేషాలను పంచుకున్నారు. 'నా 28వ సినిమాకి ముహూర్తం ఖరారైంది. చంద్రశేఖర్ యేలేటితో కలిసి పనిచేయబోతున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. మొత్తానికి రకుల్, ప్రియా ప్రకాశ్ వారియర్‌లతో కలిసి పనిచేయబోతున్నాను. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..