సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌ ప్రారంభం

- July 01, 2019 , by Maagulf
సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌ ప్రారంభం

బహ్రెయిన్‌: రెండు నెలలపాటు సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌ ప్రారంభం కానుంది. లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్టర్‌ జమీల్‌ హుమైదాన్‌ విడుదల చేసిన ఎడిక్ట్‌ 3/2013 నేటి నుంచి అమల్లోకి వస్తుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మిడ్‌ డే బ్యాన్‌ అమల్లోకి వస్తుంది. ఆగస్ట్‌ 31 వరకు ఇది అమల్లో వుంటుంది. కార్మికులు అత్యధిక ఉష్ణోగ్రతల బారిన సరాసరి పడకుండా, వారిపై సూర్యుడి ప్రభావం డైరెక్ట్‌గా వుండకుండా ఈ వర్క్‌ బ్యాన్‌ని రూపొందించారు. కంపెనీలు, అలాగే ఎస్టాబ్లిష్‌మెంట్లు తమ వర్కర్లు డైరెక్ట్‌గా ఎండ తీవ్రతకు గురి కాకుండా తగిన చర్యలు పాటించాలనీ, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలనీ మినిస్టర్‌ ఆదేశించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com