అమరనాథ్ యాత్ర నిలిపివేత..
- August 03, 2019
ఓవైపు సైన్యం మెహరింపు, మరోవైపు అమర్ యాత్ర నిలిపివేత. కశ్మీర్‌లో భారీ ఉగ్రదాడికి పాక్ కుట్రపన్నిందా? అసలు కశ్మీర్‌లో ఏం జరుగుతోంది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, కశ్మీర్‌లో పరిణామాలు క్షణం క్షణం ఉత్కంఠ రేపతున్నాయి. మరోవైపు కేంద్ర నిర్ణయాలపై కశ్మీర్ రాజకీయ నేతలు విరుచుకుపడుతున్నారు.
కశ్మీర్‌పై కేంద్రం మరింత దూకుడు పెంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 28 వేల మంది బలగాలను కశ్మీర్‌కు పంపింది కేంద్రం. అంతర్గత భద్రతా పరిస్థితుల దృష్ట్యానే పారా మిలిటరీ బలగాలను కశ్మీర్‌కు పంపామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసినా… ఇందులో వేరే ఉద్దేశం ఉందని.. ఇంత పెద్ద మొత్తంలో బలగాల మోహరింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కశ్మీర్ నేతలు. ఈ వివాదం కొనసాగుతుండగానే… కేంద్రం తీసుకున్న మరో కీలక నిర్ణయం కశ్మీర్‌లో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది.
ఉగ్రవాదులు దాడి చేసేందుకు కుట్ర పన్నారని.. అమర్‌నాథ్ యాత్రికులు, పర్యాటకులు వెంటనే కశ్మీర్ నుంచి వెనక్కు వెళ్లిపోవాలంటూ కేంద్రం హెచ్చరించింది. యాత్ర మార్గంలో పాకిస్తాన్‌లో తయారైన మందుపాతర, అమెరికా మేడ్ స్నైపర్ రైఫిల్ లభించాయని భారత ఆర్మీ ప్రకటించింది. దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కేంద్ర ప్రకటనతో ప్రస్తుతం కాశ్మీర్‌లో భయం భయం నెలకొంది. ఏం జరుగుతుందో తెలియక.. ముందుగానే ప్రజలు సరకులు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసి భద్రపరచుకునేందుకు షాపుల ముందు బారులు తీరుతున్నారు. ఏటీఎంలు, పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించే విషయమై కీలక నిర్ణయం రానుందనీ… ఆ కారణంగా గొడవలు జరిగి శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పడం ద్వారా కశ్మీర్ లోయలో ప్రభుత్వం భయం రేకెత్తిస్తోందనీ.. ఇలాంటి పరిస్థితిని తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని ఎన్‌సీ, పీడీపీ నేతలు నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి ప్రజల కన్నా.. భూభాగమే ముఖ్యమని తేలిందని పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు.
అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత, జమ్మూకశ్మీర్‌లో అదనపు బలగాల మోహరింపునకు కారణం ఏంటి? కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఇచ్చే 35ఎ, 370 రద్దు చేస్తారంటూ గత కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. అసాధారణ నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ, అమిత్‌షా దిట్ట. ఈ నేపథ్యంలో ఆగస్టు 7న పార్లమెంటు సమావేశాలు ముగిశాక కశ్మీర్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయబోతోందని.. దానికి సన్నాహకంగానే ఈ మోహరింపులు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







