అమెరికాలో ప్రభుత్వ పథకాలు వాడుకుంటే గ్రీన్‌కార్డు బంద్!
- August 13, 2019
వలసల విషయంలో కఠినమైన ఆంక్షలు విధిస్తున్న అమెరికా మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ ప్రయోజనాలను ఆశించే వలసదారులకు గ్రీన్‌కార్డును నిరాకరిస్తామని పేర్కొంది. అమెరికా పౌరులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వినియోగించుకోబోమని వలసదారులు కాన్సులర్ ఆఫీసర్‌కు నమ్మకం కలిగించాలి. అలా చేయని పక్షంలో చట్టబద్దమైన శాశ్వత నివాసాన్ని కల్పించే గ్రీన్‌కార్డును జారీచేయడం జరుగదు. ప్రభుత్వ పథకాలైన ఆహారం, వైద్యం, గృహవసతి వంటి ప్రయోజనాలను వలసదారులు ఉపయోగించుకున్నట్టు తేలితే వాళ్లపై పబ్లిక్ చార్జ్ (గ్రీన్‌కార్డు, వీసా తదితర పత్రాల రద్దు) విధించబడుతుందని అని శ్వేత సౌధం పేర్కొంది. బయటి దేశం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలపై ఆధారపడకుండా, సొంత ఆదాయంపై జీవించేలా ఈ నిర్ణయం సాయపడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







