అమెరికాలో ప్రభుత్వ పథకాలు వాడుకుంటే గ్రీన్‌కార్డు బంద్!
- August 13, 2019వలసల విషయంలో కఠినమైన ఆంక్షలు విధిస్తున్న అమెరికా మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ ప్రయోజనాలను ఆశించే వలసదారులకు గ్రీన్‌కార్డును నిరాకరిస్తామని పేర్కొంది. అమెరికా పౌరులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వినియోగించుకోబోమని వలసదారులు కాన్సులర్ ఆఫీసర్‌కు నమ్మకం కలిగించాలి. అలా చేయని పక్షంలో చట్టబద్దమైన శాశ్వత నివాసాన్ని కల్పించే గ్రీన్‌కార్డును జారీచేయడం జరుగదు. ప్రభుత్వ పథకాలైన ఆహారం, వైద్యం, గృహవసతి వంటి ప్రయోజనాలను వలసదారులు ఉపయోగించుకున్నట్టు తేలితే వాళ్లపై పబ్లిక్ చార్జ్ (గ్రీన్‌కార్డు, వీసా తదితర పత్రాల రద్దు) విధించబడుతుందని అని శ్వేత సౌధం పేర్కొంది. బయటి దేశం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలపై ఆధారపడకుండా, సొంత ఆదాయంపై జీవించేలా ఈ నిర్ణయం సాయపడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..