'అల వైకుంఠ పురములో' ఇంట్రెస్టింగ్ అప్డేట్
- August 21, 2019
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం "అల వైకుంఠపురములో. ఈ సినిమ టైటిల్ ని ఆగస్టు 15 వ తేదీన రిలీజ్ చేశారు. టైటిల్ తో పాటు చిన్న డైలాగ్ కూడా ఉంది. ఆ డైలాగ్ ఇప్పటీకే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే నా పేరు సూర్య సినిమా డిజాస్టర్ తర్వాత అల్లు అర్జున్ నుండి వస్తున్న సినిమా అవడంతో ఈ సినిమా మీద అందరికీ ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. అదీగాక, ఈ టైటిల్ కూడా మరింత ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుండి మరో ఇంట్రెస్తింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యుయల్ రో లో కనిపించనున్నాడట. అల్లు అర్జున్ ఇంతవరకు డ్యుయల్ రోల్ లో నటించలేదు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసే రెండు పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది.సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, గ్రామీణ యువకుడిగా రెండు విభిన్న పాత్రలు అల్లు అర్జున్ పోషిస్తున్నాడని విషవాసనీయ వర్గాల సమాచారం. బన్నీ ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలో సహ ఉద్యోగినిగా పూజాహెగ్డే కనిపిస్తుందని, ఆ ఇద్దరి మధ్య సాగే లవ్ ట్రాక్ సినిమాలో హైలైట్ అవుతుందని ఫిలింనగర్ న్యూస్.
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక&హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న 'అల.. వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సీనియర్ నటి టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







