చిదంబరానికి సుప్రింకోర్టు షాక్
- August 21, 2019
సుప్రింకోర్టు కేంద్రమాజీ మంత్రి చిదంబరానికి పెద్ద షాకే ఇచ్చింది. అరెస్టు నుండి తప్పించుకునేందుకు బెయిల్ పిటీషన్ వేశారు చిదంబరం. వివిధ కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరంను అరెస్టు చేయటానికి ఈడి, సిబిఐలు రెడీగా ఉన్నాయి. కేంద్ర మాజీమంత్రి దేశం దాటి వెళ్ళకుండా ముందుజాగ్రత్తగా రెండు దర్యాప్తు సంస్ధలు లుక్ అవుట్ నోటీసులను కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.
అరెస్టులనుండి తప్పించుకునేందుకు చిదంబరం తరపున ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబల్, మనుసంఘ్వి తదితరులు సుప్రింకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. వాళ్ళ అంచనా ప్రకారం సుప్రింకోర్టు గనుక బెయిల్ పిటీషన్ ను విచారిస్తే వెంటనే బెయిల్ దొరకటం ఈజీ అనుకున్నారు. కానీ సుప్రింకోర్టు వేరే విధంగా ఆలోచించింది. బెయిల్ పిటీషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏముందని చిదంబరం లాయర్లను ప్రశ్నించింది. దాంతో లాయర్లు సమాధానం చెప్పలేకపోయారు. దాంతో బెయిల్ పిటీషన్ విచారణను సుప్రింకోర్టు వాయిదా వేసింది.
దాంతో చిదంబరం అరెస్టు తప్పదని అందరికీ అర్ధమైపోయింది. అరెస్టు నుండి తప్పించుకునేందుకే చిదంబరం మంగళవారం సాయంత్రం నుండి ఎవరికీ కనిపించకుండా మాయమైపోయారు. ఎక్కడో హైడవుట్ లో దాక్కున్నారు. అందుకనే దర్యాప్తు సంస్ధలు చిదంబరం పరారీలో ఉన్నాడని చెబుతున్నాయి. నిజానికి చిదంబరం కోసం వెతకటం కూడా కష్టమే. ఇంతపెద్ద దేశంలో ఓ మనిషి దాక్కుంటే వెతికపట్టుకోవటం మామూలు విషయం కాదు.
ఒకపుడు దేశంలోనే ప్రముఖ వ్యక్తిగా ఓ వెలుగు వెలిగిన చిదంబరం ఇపుడు దర్యాప్తు సంస్ధల నుండి అరెస్టు భయంతో తప్పించుకుని తిరుగుతున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. స్వయంగా లాయర్ అయివుండి కూడా దర్యాప్తు సంస్ధల నుండి తప్పించుకుని తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నపుడు ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన చిదంబరం ఇపుడు అదే అధికారం వల్ల నానా అవస్తలు పడుతున్నారు.
విచిత్రమేమిటంటే చిదంబరం బెయిల్ పిటీషన్ ను విచారించింది చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితునిగా ప్రచారంలో ఉన్న ఎన్వీ రమణ కావటమే. పిటీషన్ ఎన్వీ రమణ ముందుకు వచ్చింది కాబట్టి చిదంబరానికి బెయిల్ ఖాయమనే అనుకున్నారు. తీరా చూస్తే వ్యవహారం బెడిసికొట్టింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







